Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటీష్ కాలంనాటి క‌ట్ట‌డాలు మ‌ట్టితోనే ఎందుకు క‌ట్టారో తెలుసా- ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (17:58 IST)
Art Director Avinash Kolla
బెంగాల్ లోని క‌ల‌క‌త్తా మ‌హాన‌గ‌రంలో 1900 నుంచి బ్రిటీష్ పాల‌కులు క‌ట్టిన భ‌వ‌నాలు, అందుకు వాడిన క‌ల‌ర్స్‌, అదేవిధంగా కాళీ మాత ఆల‌యం ఎందుకు ఆ రూపులో వుంటుంది? అక్క‌డి సంప్ర‌దాయాలు ఎలా వుంటాయి. పండుగ‌లు ఎలా చేసుకుంటారో అనేవి కూలంక‌షంగా ప‌రిశోధించి డిజైన్ చేసి రూపొందించామ‌ని ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల తెలియ‌జేశారు. నాని న‌టించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి ఆయ‌న ప‌నిచేశారు. ఇంత‌కుముందు మ‌హాన‌టి వంటి సినిమాల‌కు ప‌నిచేసిన ఆయ‌న తాజాగా శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ప‌శ్చిమ‌బెంగాల్‌లోని ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించి అందుకు సంబంధించిన సెట్‌ను హైద‌రాబాద్‌లో కూడా వేశారు.
 
న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మీడియాతో ముచ్చటించారు..
 
- సౌత్‌లో ప్ర‌కృతి వేరుగా వుంటుంది. మ‌న ద‌గ్గ‌ర రాళ్లు వుంటాయి. క‌ట్ట‌డాలు ఎక్క‌వుగా వాటితోనే క‌డ‌తారు. కానీ బెంగాల్‌లో కేవ‌లం మ‌ట్టితోనే క‌డ‌తారు. అక్క‌డ దొరికేది అదే. అప్ప‌ట్లో లేబ‌ర్ కూడా చ‌వ‌క‌గా వ‌చ్చేవారు.  
 
- కోల్‌కతా నేపథ్యంలో సినిమా రాబోతోందనే విషయమే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కోల్‌కతా కల్చర్ ఇండియాలో ఎక్కడా కనిపించదు. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకుని ఆ సెట్ వేశాను.
 
ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. కానీ అవన్ని బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉన్నాయి. దాని వల్ల అంతగా ఉపయోగం ఏమీ లేదు.
 
- అన్ని సెట్స్ హైద్రాబాద్‌లోనే వేశాం. ట్రైలర్‌లో చూసి ఉంటే ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. అప్పుడు వాడిన పేపర్, టెక్స్ట్ ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న వాటిని తెలుసుకుని, కొన్నింటిని రీక్రియేట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద సెట్ టెంపుల్ సెట్. అందులో మేజర్ సీన్స్ తెరకెక్కించారు. టెంపుల్ సెటప్ మేజర్ హైలెట్ అవుతుంది. ఆ సెట్‌ను హైద్రాబాద్‌లోనే వేశాం. ఆరు ఎకరాల్లో వేసిన ఆ సెట్ కోసం మూడు నెలల పాటు, రోజూ మూడొందల మంది శ్రమించారని తెలిపారు.
- ఇందులో రెండు కథలుంటాయి. ఒకటి ప్రజెంట్‌గా జరుగుతుంది. ఇంకోటి 70వ దశకంలో బెంగాల్‌లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. గత ఏడాది లాక్డౌన్ సమయంలో బెంగాల్‌లోనే ఉండిపోయాను. సౌత్, నార్త్ ఒకరకమైతే..బెంగాల్‌లో మరోలా ఉంటుంది. అక్కడి ఆర్కిటెక్చర్, టెంపుల్స్ అన్నింటిపై పరిశోధించాను.
-  కరోనా వల్ల చాలా రోజు సెట్స్ పనులు ఆగిపోయాయి. మధ్యలో వర్షాలు, తుఫాను వల్ల ఇబ్బంది ఏర్పడింది. కానీ మళ్లీ షూటింగ్ మొదలయ్యే సరికి సెట్స్‌ను రెడీ చేశాం.
 
- నిర్మాత గారు నన్ను ఏనాడూ ఏ ప్రశ్న వేయలేదు. ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడగలేదు. ఇలాంటి సినిమాలకు అలాంటి నిర్మాతలే ఉండాలి. అలాంటప్పుడే కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ తీసుకురాగలం.
 
- శ్రీమంతుడు సినిమాకు అప్రెంటిస్‌గా పని చేశాను. ఆ తరువాత నాని గారి కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాకు మొదటిసారి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆయనతో జెర్సీగా కూడా చేశాను. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్. ఆ తరువాత దసరా కూడా చేస్తున్నాను.
 
- నిర్మాతగా త్రిష మెయిన్ లీడ్‌గా ఓ వెబ్ సిరిస్‌ను సోనీ లివ్ సంస్థకు చేస్తున్నాం. బృందా అనే ప్రొడక్షన్ టైటిల్‌తో రాబోతోన్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments