Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'వాసు - శ్యామ్ సింగరాయ్' లవ్ - యాక్షన్ - రొమాంటిక్ ట్రైలర్ రిలీజ్

'వాసు - శ్యామ్ సింగరాయ్' లవ్ - యాక్షన్ - రొమాంటిక్ ట్రైలర్ రిలీజ్
, బుధవారం, 15 డిశెంబరు 2021 (10:32 IST)
నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మించిన చిత్రం "శ్యామ్ సింగరాయ్". నాని హీరోగా నటించారు. డబుల్ షేడ్స్‌లో నాని ఈ చిత్రంలో కనిపిస్తారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. కోలీవుడ్ హీరోయిన్లు కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, సాయిపల్లవిలు నటించారు. ఈ నెల 24వ తేదీన తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. 
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకునేలా వుంది. ఇంకా సినిమా అంచనాలను భారీగా పెంచేలా వుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఐ యామ్ వాసు.. ఫిలిం డైరెక్టర్ అంటూ నాని తనను పరిచయం చేసుకునే సీన్‌తో ట్రైలర్ మొదలైంది. వాసు జర్నీలో కృతిశెట్టితో లవ్ ట్రాక్ కనిపిస్తుంది. ఆ తర్వాత తన పోలికలతో ఉన్న శ్యామ్ సింగారాయ్ కథ గురించి తెలుసుకుంటాడు వాసు. శ్యామ్ సింగరాయ్ దేవదాసి అయిన సాయిపల్లవి ప్రేమలో పడతాడని తెలుస్తుంది. 
 
మరోవైపు, సమాజంలోని సమస్యలపై శ్యామ్ సింగరాయ్ ఎలాంటి పోరాటం చేశాడనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రేమ, యాక్షన్, రొమాంటిక్ సీన్ల కలబోతగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచింది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన "క్షీరసాగర మథనం"