Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన "క్షీరసాగర మథనం"

Advertiesment
బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన
విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (09:58 IST)
బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన క్షీర సాగర మథనం చిత్రానికి తెలుగులో అసాధారణ విజయం లభించింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నఈ చిత్రానికి ఇప్పటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్ర కథానాయకుడు మానస్ నాగులపల్లి బిగ్ బాస్ కి సెలెక్ట్ కావడం, అందులో అత్యద్భుతంగా ఆడుతూ "టాప్-5"కి చేరడం "క్షీరసాగర మథనం" చిత్రానికి బాగా కలిసొచ్చింది. 
 
 
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన "క్షీరసాగర మథనం" చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది.
 
 
ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్  ఆడియన్స్ ఇప్పటికీ విశేషంగా ఆదరిస్తున్నారని, త్వరలోనే చిత్రాన్ని హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనువాదం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  దర్శకుడు అనిల్ పంగులూరి తెలిపారు. తమ హీరో మానస్ నాగులపల్లి బిగ్ బాస్ కి సెలెక్ట్ కావడమే కాకుండా అందులో అత్యద్భుతంగా ఆడుతూ, లక్షలాదిమంది అభిమానం చూరగొంటుండడం "క్షీరసాగర మథనం" చిత్రం ఇంత ఘన విజయం సాధించడానికి కారణమయ్యిందని తెలిపారు. మానస్ నాగులపల్లి బిగ్ బాస్ విజేతగా నిలవాలని మనసారా కోరుకుంటున్నామని, అందుకు మానస్ అన్నివిధాల అర్హుడని అనిల్ పంగులూరి చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నుంచి దేవుడు కాపాడాడు.. 'అఖండ'ను ప్రేక్షకదేవుళ్లు కాపాడారు : బాలకృష్ణ