బిగ్‌బాస్ తెలుగు సీజన్ అందరికీ తెలిసిందే. ఒకే ఇంటిలో కొన్ని గదులమధ్య కొన్ని రోజులవరకు కొందరు సెలబ్రిటీలు గడిపే తీరు చూసేవాడికి ఆనందాన్ని ఇవ్వడంతో ఇప్పటికీ నాలుగు సీజన్లు వచ్చాయి. బిగ్‌బాస్ పుణ్యమా అని కొందరు స్టార్‌లు అయిపోయారు. అయితే ఈసారి సీజన్ 5ను ఆర్భాటంగా చేయాలని నిర్వాహకులు ఆరంభించారు. లాభాలు తెచ్చిపెట్టే ఈ షోను మరింత ఆకర్షణీయంగా వుండేందుకు చిన్నపాటి సెలబ్రిటీస్‌లను కూడా ఎంపిక చేశారు. వారికి ఆడిషన్ కూడా జరిపారు. దీనివల్ల ఎప్పటిలాగే చిన్నస్థాయి సెలబ్రెటీలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యూట్యూబ్ స్టార్స్, పేరున్న సాంకేతిక నిపుణులు 'బిగ్ బాస్5'లో చోటు దక్కించుకోబోతున్నారు.
కానీ, కరోనా సెకండ్ వేవ్ మరింత కంగారు పెట్టింది. బిగ్‌బాస్ ఫేమ్ నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. తన స్టూడియోకు అన్యులెవరినీ రానివడ్డంలేదు. పైగా షోకు సంబంధించిన వర్క్ మొత్తంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్కడే రెండు సినిమా షూటింగ్‌లు జరుగుతుండగా వాటిని కూడా ఆపివేసినట్లు సమాచారం. షూటింగ్‌లకు మేకానీ, జూన్ కానీ మరలా మొదలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా వుండగా, బిగ్‌బాస్ సీజన్5కు మాత్రం ఎంపికైన వారిని హెల్త్ చెకప్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాల్సి వుంటుంది. అది చూశాక. స్టూడియోలో మరోసారి వారికి చెకప్ చేస్తామని రూల్ పెట్టారు. సో. ఇవన్నీ జరగాలంటే దాదాపు సెప్టెంబర్ కావచ్చని. అప్పటివరకు బిగ్‌బాస్ ఆలోచన లేదని స్టూడియో నిర్వాహకులు తెలియజేసినట్లు సమాచారం. మరి వ్యాఖ్యాత నాగార్జున త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేయనున్నారు. ముగించాలనుకుంటున్నారట. ఈ 'బిగ్ బాస్ 5'కి కూడా నాగార్జుననే వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.