Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-04-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించినా...

Advertiesment
23-04-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించినా...
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (04:00 IST)
మేషం : గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. దైవ, శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రయ విక్రయాలు సామాన్యం. 
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చోటుచేసుకుంటాయి. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు ముఖ్యం. గృహంలో మార్పులు, మరమ్మతులు వాయిదాపడతాయి.
 
మిథునం : ఉపాధ్యాయులకు బదిలీ సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో పాల్గొంటారు. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాహన నడుపునపుడు జాగ్రత్త వహించండి. ఫ్యాన్సీ, కిరాణా, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం : వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్థిరచరాస్తుల మీడియా వారికి మిశ్రమ ఫలితం. తోటల రంగాల వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాల్లో ఏకాగ్రత వహించండి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
సింహం : మీ అభిప్రాయాలకు వ్యతిరేకత ఎదురవుతుంది. నూతన వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి నిలదొక్కుకుంటారు. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపరిచిత వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. జాగ్రత్త వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
కన్య : కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు ఆశించినత సంతృప్తినీయవు. ప్రముఖుల కలయిక, బ్యాంకు వ్యవహారాలు ఒక పట్టాన పూర్తికావు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార లావాదేవీలు, అగ్రిమెంట్ల విషయంలో ఏకాగ్రత వహించండి. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. 
 
తుల : మీ సమర్థతకైప మీకే నమ్మకం సన్నగిల్లుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. స్త్రీలతో మిత సంభాషణ క్షేమదాయకం. ఎదుటివారి విషయాలలో జోక్యం చేసుకోవడం వల్ల మాటపడక తప్పదు. గృహంలో మార్పులు, చేర్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. 
 
వృశ్చికం : ఇతరుల శ్రేయస్సు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్రైవేటు, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. ఇతరుల ముందు మరొకరి ప్రస్తావన మంచిదికాదు. ఎడతెగని ఆలోచనలతో మనస్థిమితం ఉండదు. 
 
ధనస్సు : బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెళకువ వహించండి. స్త్రీలకు పొదుపు పథకాలపై ఆసక్తి నెలకొంటుంది. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. తలపెట్టిన పనులు హడావుడిగా పూర్తి చేస్తారు.
 
మకరం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. విద్యార్థులకు పోటీ పరీక్షల ఏకాగ్రత, సమయపాలన అవసరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. రాజకీయ నాయకుల కదలికలపై విద్రోహులు కన్నేసిన విషయం గమనించండి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. 
 
కుంభం : ఏసీ, కూలర్ మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవస్తుంది. దూరదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలతో సంభాషించునపుడు సంయమనం పాటించండి. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరాత్రా చికాకులు అధికమవుతాయి.
 
మీనం :  బంధు మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. మీ కళత్ర పట్టుదల, సంతానం మొండి వైఖరి వల్లచికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళకు లొంగకుండా స్థిరచిత్తంతో వ్యవహరించ వలసి ఉంటుంది. అద్దె ఇంటికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాల పట్ల చురుకుగా పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-04-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...