Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-04-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...

Advertiesment
22-04-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (04:00 IST)
మేషం : పెద్దల ఆరోగ్యం కోసం ధన విరివిగా వ్యయం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృషభం : బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన మంచిది. సంఘంలో మీ మాటకు మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిథునం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు ప్రణాళికలు చేపడుతారు. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. 
 
కర్కాటకం : గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. కొంత మొత్తం సాయం చేసి వారిని సంతృప్తి పరచండి. మిత్రులతో సంభాషించడం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అంతగా పరిచయంలేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. 
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిదికాదని గమనించండి. ఫైనాన్స్, చిట్‌ఫండ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఇంటా బయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. 
 
తుల : విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కొత్త పనులు ప్ర్రారంభించండంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంత నిదానంగా నడపడం మంచిది. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలేర్పడతాయి. 
 
వృశ్చికం : చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. మీరు దేనని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. రుణాలు తీరుస్తారు. 
 
ధనస్సు : స్త్రీలకు ఇరుగు, పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. ప్రముఖులను కలుసుకుంటరు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మకరం : వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో ఊహించని అవకాశాలు వస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రతి పని చేతిదాగా వచ్చి వెనక్కి పోవుటవల్ల ఆందోళన చెందుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. 
 
కుంభం : రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
మీనం : ఆర్థిక సమస్యలు తలెత్తుట వల్ల ఆందోళన చెందుతారు. భవిష్యత్ ప్రణాళికల గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాముడు జీవితంలో ఎన్నో వైఫల్యాలు... ఐనా ఆ దేవుడినే భారతదేశమంతటా ఎందుకు కొలుస్తారు...?