Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా నుంచి దేవుడు కాపాడాడు.. 'అఖండ'ను ప్రేక్షకదేవుళ్లు కాపాడారు : బాలకృష్ణ

Advertiesment
కరోనా నుంచి దేవుడు కాపాడాడు.. 'అఖండ'ను ప్రేక్షకదేవుళ్లు కాపాడారు : బాలకృష్ణ
, బుధవారం, 15 డిశెంబరు 2021 (09:23 IST)
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రజలను ఆ దేవుడు కాపాడుతున్నారని, అలాగే, సినిమా రంగంతో పాటు.. అఖండ సినిమాను ప్రేక్షక దేవుళ్లు కాపాడుతారని సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన బుధవార దుర్గామాతను దర్శనం చేసుకున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆయన ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బాలయ్య, బోయపాటిలకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. కాగా, ఇటీవల బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన "అఖండ" చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఈ నెల 2వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సూపర్ టాక్‌తో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం విజయంపై బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎల్లవేళలా మంచి సినిమాలకు బ్రహ్మరథం పడుతారని మరోమారు నిరూపితమైందన్నారు. ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసిన దాన్ని నిరూపించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. 
 
అంతేకాకుండా, కరోనా కష్టకాలంలో సినిమాలు విడుదల చేసేందుకు ప్రతి ఒక్కరూ వెనుకాడుతున్నారని, అలాంటి సమయంలో తాము ధైర్యం చేసి ముందుకు వచ్చామన్నారు. దీనికి కారణం సినిమా చాలా బాగా ఉందని, ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారన్న ధైర్యం తమను ముందుకు నడిపిచిందన్నారు. చిత్రం విడుదలైన తర్వాత తమ నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేయలేదని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని రాష్ట్ర హైకోర్టు రద్దు చేయడంపై ఆయన స్పందించారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ఉన్నప్పటికీ సినిమా బాగుందన్న ధైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్లామన్నారు. అయితే, ఇపుడు ఏపీ హైకోర్టు ఆ జీవోను రద్దు చేసినప్పటికీ ప్రభుత్వం మళ్లీ అప్పీలుకు వెళ్తుందని, అందువల్ల ఆ విధానం అలాగే నడుస్తుందని బాలకృష్ణ చెప్పారు. అయితే, కథలో సత్తా ఉన్న సినిమాలను ఇవేమీ అడ్డుకోలేవని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించిన కరీనా - భర్త ఆచూకీ చెప్పని నటి