Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారిశుధ్య కార్మికులపై లోక్ సభలో గళమెత్తిన ఎంపి కేశినేని నాని

Advertiesment
vijayawada mp
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:49 IST)
పారిశుధ్య కార్మికుల త‌ర‌ఫున ఏపీ ఎంపీ కేశినేని నాని పార్ల‌మెంటులో గ‌ళ‌మెత్తారు. దేశంలో ఎందరు పారిశుధ్య కార్మికులు ఉన్నారో అధికారిక గణాంకాలు ఉన్నాయా? ఉంటే, రాష్ట్రాల వారీ సమాచారం, మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ఎబాలిషన్ యాక్ట్ , 2013 ప్రకారం  మాన్యువల్ స్కావెంజర్ పనిని నిషేధించలేకపోవడం నిజమేనా? పారిశుధ్య కార్మికుల పునరావాస పథకంలో ఎందరు ప్రయోజనం పొందారు? మంత్రిత్వశాఖ పారిశుద్ధ కార్మికుల డేటా బేస్ నిర్వహిస్తోందా, మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల పరిశుభ్రతలో ప్రమాదాలు నివారణ చర్యలు ఏమిటి? అని ఎంపీ కేశినేని నాని ప్ర‌శ్నించారు.
 
 
2013, 2018 సంవత్సరాలలో మాన్యువల్ స్కావెంజర్ల గుర్తింపు కోసం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ రెండు సర్వేలను నిర్వహించి అర్హులైన 58,098  మాన్యువల్ స్కావెంజర్లను గుర్తించారు. పారిశుద్ధ్యం అనేది రాష్ట్రలకు సంబంధించిన అంశం. అలాగే పారిశుద్ధ్య కార్మికుల సమాచారాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించదు. 
 
 
మురుగు కాలవలు, సెప్టిక్ ట్యాంక్ జరిగే ప్రమాదాలు భద్రత చర్యల కోసం ప్రతి మున్సిపాలిటిలో శానిటేషన్ రెస్పాన్స్ యూనిట్, మెకనైజెడ్ క్లినింగ్, ఆధునిక యంత్రాలు, పరికరాలు, శిక్షణ పొందిన కార్మికులను ఏర్పాటు చేశారు. సెంట్రల్ సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్‌ మెంట్ స్కీమ్ కింద మాన్యువల్ స్కావెంజర్లకు అదనంగా, పారిశుధ్య కార్మికులు మరియు వారిపై ఆధారపడిన వారికి కూడా పునరావాస కార్యక్రమంలో మూల ధన సబ్సిడీ రూ. 5లక్షలు అందించారు. 
 
 
పారిశుద్ధ్య కార్మికుల కోసం స్వల్ప వ్యవధి శిక్షణ కార్యక్రమం నిర్వహించాల‌ని, వారు సురక్షితమైన,   యాంత్రికంగా శుభ్రపరిచే పద్ధతులలో శిక్షణ పొందాల‌ని కేంద్ర మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు. 
మాన్యువల్ స్కావెంజర్స్ కి ఆంధ్రప్రదేశ్ లో స్వయం ఉపాధి కింద మూల ధనం పైన రాయితీ పొందినవారు 52 మంది, స్కిల్  డెవలప్మెంట్ కింద శిక్షణ పొందినవారు 252 మంది ఉన్నార‌ని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చి..?