ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని కేశినేని భవన్ ఖండించింది. కేశినేని_భవన్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఫ్లెక్స్ లు తొలగించ లేదని పార్టీ కార్యాలయం బాధ్యులు తెలిపారు. కేశినేని భవన్ లో ఒక చోట రతన్ టాటాతో నాని ఉన్న ఫోటో మాత్రమే ఏర్పాటు చేసారు. కేశినేని భవన్ చుట్టూ చంద్రబాబు, నేతల ఫ్లెక్స్ లు అలాగే ఉన్నాయి. కేశినేని భవన్ లోని అన్ని ఛాంబర్లలో చంద్రబాబు, ఎన్ఠీఆర్ ఫోటోలు అలానే ఉన్నాయి.
సోషల్ మీడియాలో కొందరు పని కట్టుకుని ఎంపీ కేశినేని నానిపై గిట్టని పోస్ట్లు చేస్తున్నారని కేశినేని భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన బీజేపీకి వెళతారని వదంతులు పుట్టిస్తున్నారని, అది అవాస్తవమన్నారు. రతన్ టాటా ట్రస్ట్ తో కలిసి చేసే సేవలు మరింత విస్తరిస్తున్నారని, పార్టీ లు మారతారు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ కేశినేని నాని పై ప్రతి సారి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.