Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య
, శనివారం, 16 అక్టోబరు 2021 (16:17 IST)
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురయ్యారు. అలాగే, ఆ దేశంలోని హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతూనేవున్నాయి. బంగ్లాదేశంలో దుర్గ పూజ సందర్భంగా కొన్ని హిందూ దేవాలయలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు మత ఘర్షణలకు దారితీశాయి. 
 
ఈ దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని... వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా గట్టి హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ దాడులు ఏమాత్రం ఆగలేదు కదా ఇద్దరు హిందువుల హత్యకు దారితీశాయి. 
 
తాజాగా చెలరేగిన హింసలో ఇద్దరు హిందువులను దారుణంగా హత్య చేశారు. ఈ రెండు మరణాలతో కలిపి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఓ మందిరంలో ఉన్న హిందూ దేవుడిపై ఖరాన్‌ను ఉంచిన ఫుటేజీ బుధవారం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
 
శుక్రవారం ప్రార్థనలు ముగించుకున్న తర్వాత బేగంగంజ్ పట్టణంలో వందలాది ముస్లింలు రోడ్లను ఆక్రమించుకున్నారు. శుక్రవారం పండుగ సందర్భంగా హిందువులు పూజకు సిద్ధమవుతున్న సమయంలో 200 మంది ముస్లిం ఆందోళనకారులు ఆలయంపై దాడికి పాల్పడ్డారు. 
 
ఈ దాడిలో ఆలయ కమిటీ అధ్యక్షుడిని దారుణంగా కొట్టి చంపేశారు. శనివారం ఉదయం గుడి వద్ద ఉన్న కొలను వద్ద మరో మృతదేహం కనిపించింది. ఆ తర్వాత హిందూ వ్యతిరేక నిరసనలు మరో 12 జిల్లాలకు విస్తరించాయి. బుధవారం నుంచి కనీసం నలుగురు చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో కుంభవృష్టి : ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక