Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ‌నంపూడి బాలిక అత్యాచారం నిందితుల‌ను శిక్షించాలి

అగ‌నంపూడి బాలిక అత్యాచారం నిందితుల‌ను శిక్షించాలి
విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (10:17 IST)
విశాఖపట్నం గాజువాక అగనంపూడి ఆదిత్య నివాస్ అపార్ట్మెంట్ లో 14 సంవ‌త్స‌రాల రజక మైనర్ బాలిక పావనిని అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మాగులను కఠినంగా శిక్షించాలని నిరసనలు ప్రారంభ‌మ‌య్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శ్రీ వినాయక రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజక కులస్తులంతా ఏకమై రోడ్డుపై నిరసన తెలుపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రజక అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంకెళ్ళ రాంబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజక కులస్తులపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు బాగా ఎక్కువయ్యాయన్నారు.  
 
 
మొన్న ఒంగోలు, తరువాత నెల్లూరు, నిన్న నర్లజర్ల, నేడు విశాఖపట్నం ఇలా ఎన్నో దాడులు జరుగుతునే ఉన్నాయ‌ని ఆరోపించారు. బాలిక కుటుంబానికి న్యాయం జరగాలని, పావని తల్లిదండ్రులకు 25 లక్షలు ఎక్షగ్రెషియా ఇవ్వాలని డిమాండు చేశారు. ఇవ్వకపోతే వేల్పూరులోనే కాదు, ప్రతి జిల్లాలో ఉన్న రజకులందరు కలిసి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు.
 
ఈ కార్యక్రమం లో రజక అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంకెళ్ళ రాంబాబు మహిళ అధ్యక్షురాలు దుర్గా నవ్యంధ్రప్రదేశ్ వృతి దారుల సంఘం  అధ్యక్షులు అడ్డాల నరసింహరావు రజక సేవా సంఘం ప్రెసిడెంట్ పోలవరపు దానరాజ్ వైస్ ప్రెసిడెంట్ సంఘ సభ్యులు శ్రీ వినాయక రజక సేవా సంఘం ప్రెసిడెంట్ శ్రీను వైస్ ప్రెసిడెంట్ బాలు సంఘ సభ్యులు వివిధ నాయకులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ నుంచి రెండున్నర గంటల్లో తిరుపతికి...స్పైస్ జెట్ విమాన సర్వీసు