Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చి..?

Advertiesment
omicron
Omicron
శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తేలింది. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. 
 
అతన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతని శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన టెస్టులు నిర్వహిస్తున్నారు. 
 
సదరు వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
 
బాధితుడు గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు సమాచారం అందుతోంది. అతను వచ్చిన వెంటనే టెస్టు చేసినప్పటికీ నెగెటివ్ వచ్చింది. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2022 టీటీడీ క్యాలెండ‌ర్లు, డైరీల బుకింగ్ ... వెబ్‌సైట్‌, అమెజాన్‌లో