నానితో శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి మీడియాతో ముచ్చటించారు.
- నేను 12 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఎన్నో సినిమాలకు బ్యాకెండ్ పని చేశాను. క శ్యామ్ సింగ రాయ్ మేకింగ్ విషయంలో మాత్రం ఏనాడూ ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. ముందు నేను వేరే సినిమా చేయాల్సింది. కానీ నాని గారే నన్ను ఈ సినిమా చేయమన్నారు. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. గొప్ప సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. నానికి జర్సీ ఎలాగో నాకు శ్యామ్ సింగరాయ్ అలాంటి చిత్రం.
- కరోనా వల్ల కాస్త బడ్జెట్ పెరిగింది. ఆ విషయం మాకు ముందే తెలుసు. కొన్ని సెట్స్ దెబ్బతిన్నాయి. అందుకే బడ్జెట్ పెరిగింది.
- థియేటర్స్ కౌంట్ తెలీదు కానీ మాకు కావాల్సినన్నీ థియేటర్లు ఇచ్చారు. దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
- సినిమా చూస్తే కచ్చితంగా 1970 కలకత్తాకు వెళ్తాం. అక్కడి కల్చర్ తెలుస్తుంది. మనం కచ్చితంగా 70వ దశకంలోకి వెళ్లినట్టు ఫీలవుతాం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తాం.
- కలకత్తా బ్యాక్ డ్రాప్‌ను చూపించేందుకు భారీ సెట్స్ వేశాం. అంతేకాకుండా కలకత్తాకు 400 కి.మీ దూరంలో ఉన్న ఊర్లో షూట్ చేశాం.
- ఇది యూనివర్సల్ మూవీ. తెలుగు వాళ్లకే నచ్చే సినిమా ఏమీ కాదు. బెంగాలీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. ఇది హిందీలో రీమేక్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే హిందీలో విడుదల చేయడం లేదు. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు.
- ఇండస్ట్రీలో 12 ఏళ్లుగా ఉన్నాను. ఏడాది క్రితం నిర్మాతగా మారాను. ఓ మూడేళ్ల నుంచి నాని గారితో సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాను. అలా నాకు ఓ స్పెషల్ మూవీ ఆయనతో చేసే అవకాశం వచ్చింది. మళ్లీ శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను చేస్తానో కూడా తెలీదు.
- నాని గారితో సినిమా చేస్తే ఒత్తిడి అనేది ఉండదు. కృష్ణార్జున యుద్దం సినిమాలో నేను భాగస్వామిని. చేస్తే ఇలాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నాను.
- మొదటగా నిర్మాత అవ్వాలనే ఆలోచన లేదు. కానీ కృష్ణార్జున యుద్దం చేసే సమయంలో సొంత ప్రొడక్షన్ పెట్టాలని అనుకున్నాను. అది కూడా నాని గారి సినిమాతోనే ప్రారంభించాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను.
- నాని మీదున్న నమ్మకంతోనే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఆయన కథను నమ్మారు. ఆయన్ను నేను నమ్మాను. నాని గారు డైరెక్టర్‌ను నమ్మారు..
- నా దృష్టిలో నిర్మాతకు హీరో, దర్శకులంటే ప్రేమ ఉండాలి. వారిపై నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మేకింగ్ థియేటర్ లో ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుంది.