Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాలు తెలుసుకోకుండా రాయ‌కండి: హీరో త‌నీష్

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (14:36 IST)
Tanish
బెంగ‌ళూరు నిర్మాతతో సంబంధాలు అంటూ యువ‌హీరో త‌నీష్ పై ప‌లు చానెళ్లు క‌థ‌నాలు ప్రచారం చేయ‌‌డాన్ని ఆయన ఓ వీడియో ద్వారా  ఖండించారు. డ్ర‌గ్స్ కేసులో నోటీసులు అంటూ ఇష్టానుసారం ప్ర‌చారం చేసేశారు. ఇందులో నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు క‌నీసం న‌న్ను సంప్ర‌దించ‌లేదు.. నా కుటుంబాన్ని ఆ వార్త‌లు తీవ్రంగా బాధించాయి`` అంటూ వాపోయారు త‌నీష్‌. బెంగ‌ళూరు నిర్మాత‌కు డ్ర‌గ్స్ కేసులో నోటీసులు వ‌చ్చిన మాట నిజం. నాకు నోటీసు వ‌చ్చింది. కానీ నాకు వ‌చ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం కొన్ని మీడియాలు ప్ర‌చారం చేయ‌డం నా కుటుంబాన్ని బాధించింద‌ని త‌నీష్‌ అన్నారు. అస‌లు బెంగ‌ళూరు నిర్మాత‌తో రెండేళ్లుగా ఎలాంటి సంప్ర‌దింపులు లేవు అని తెలిపారు.
 
ఈ కేసులో నాకు వ‌చ్చిన నోటీసుకు కార‌ణం వేరు. `ఫలానా వివ‌రం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి!` అని మాత్ర‌మే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాన‌ని నోటీస్ పంప‌లేదు.. ఇది తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ఇష్టానుసారం క‌థ‌నాలు అల్లేశాయి. నేను నా కుటుంబం చాలా క‌ల‌త‌కు గుర‌య్యాం. ద‌య‌చేసి ఇలాంటి అస‌త్య ప్ర‌చారం చేయొద్దు.

కొన్ని మీడియాలు న‌న్ను సంప్ర‌దించి న్యాయ‌బ‌ద్ధంగా నిజాల్ని ప్ర‌చురించాయ‌ని త‌నీష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. బెంగ‌ళూరు నిర్మాత నాతో సినిమా చేస్తానంటూ గ‌తంలో సంప్ర‌దించిన మాట నిజం. కానీ ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. రెండేళ్లుగా ఆయ‌న‌తో ఎలాంటి కాంటాక్టులోనూ లేను. అవ‌కాశాల కోసం ఎంద‌రినో క‌లుస్తుంటాం. అభ్య‌ర్థిస్తుంటాం. కానీ ఆయ‌న‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.. అని త‌నీష్ ఓ వీడియో ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. ద‌య‌చేసి అస‌త్యాలు ప్ర‌చారం చేయొద్ద‌ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments