Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ వ‌ద్ద‌న్న అన్నం?

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (12:34 IST)
Annam poster
ఆమ‌ధ్య ఎప్పుడో బాల‌కృష్ణ‌తో కృష్ణవంశీ రైతు స‌మ‌స్య‌ల‌పై ఓ సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేశాడు. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు కృష్ణవంశీ  త‌న తాజా సినిమాకు `అన్నం` టైటిల్ పెట్టి పోస్ట‌ర్‌ను కూడా రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది. అరటి ఆకులో రక్తం పసుపు తాడు కొడవలిని చూపించి ఇంట్రెస్ట్ ను కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఆ పోస్టర్ ను చూస్తుంటే సినిమా రైతులు వ్యవసాయం నేపథ్యంలో అనే విషయం క్లారిటీ వచ్చేసింది. అన్నం సినిమాలో ఒక స్టార్ నటుడిని నటింపజేసేందుకు కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో రైతు కాన్సెప్ట్ తో బాలకృష్ణ హీరోగా సినిమా చేయాలని కృష్ణవంశీ భావించారు. చర్చలు కూడా జరిగాయి. కాని చివరికి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు అన్నం టైటిల్ తో కొత్త సినిమాను కృష్ణవంశీ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమా కోసం స్టార్ నటుడిని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మ‌రి బాల‌కృష్ణ వ‌దిలేసిన అన్నంను ఎవ‌రైనా ముట్టుకుంటారో లేదో చూడాలి. ఇప్ప‌టికే రైతు స‌మ‌స్య‌ల‌పై మ‌హ‌ర్షి, శ్రీ‌కారం వ‌చ్చాక కృష్ణ‌వంశీకి ధైర్యం వ‌చ్చింద‌ని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

లేడీ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన తాగుబోతు ఆటో డ్రైవర్

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

ఏపీలో 'స్త్రీశక్తి' అనూహ్య స్పందన - ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం సిగపట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments