Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను'.. లెక్కల మాస్టారు ట్వీట్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 9వ తేదీన విడుదలైన చిత్రం "మహానటి". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా, ఈ చిత్రాన్ని చూసిన ప్రతి సెలెబ్రిటీ కూడా ప్రశంసల వర్షం కురిపించక ఉండలే

Webdunia
గురువారం, 10 మే 2018 (16:49 IST)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి ఈనెల 9వ తేదీన విడుదలైన చిత్రం "మహానటి". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా, ఈ చిత్రాన్ని చూసిన ప్రతి సెలెబ్రిటీ కూడా ప్రశంసల వర్షం కురిపించక ఉండలేకపోతున్నారు. తాజాగా 'రంగస్థలం' డైరెక్టర్ సుకుమార్ కూడా పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్‌లో 'మహానటి' సినిమా చూసి బయటకి వచ్చాక తనకి జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు.
 
"ప్రియ"మైన అశ్విన్.. 'మహానటి' సినిమా చూసి బయటకి వచ్చి నీతో మాట్లాదామని నీ నంబర్‌కి ట్రై చేస్తున్నాను. ఈలోగా ఒక ఆవిడ వచ్చి "నువ్వు డైరెక్టరా బాబు" అని అడిగింది. అవునన్నాను.. అంతే.. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మ"ని అంటూ.. నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను.. మనసారా.. ఆవిడా నన్ను దీవించి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.. ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు  కాదని తెలియకపోతే బావుండు.. అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
 
కాగా, సుకుమార్ కూడా ఇటీవలే బ్లాక్‌బస్టర్ హిట్‌ను కొట్టిన విషయం తెల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సమంతలు కలిసి నటించిన "రంగస్థలం" చిత్రానికి సుకుమార్ దర్శకుడు. ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్‌ను సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఆపరేషన్ సిందూర్ దాడులు : 80 మంది ఉగ్రవాదుల హతం

మంగళవారం అర్థరాత్రి 1.44 గంటలకు ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ (Video)

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments