Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అశ్వినీదత్‌కు ఎంత ధైర్యముంటే 'మహానటి'ని నిర్మిస్తారు : కె.రాఘవేంద్ర రావు

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం "మహానటి". కీర్తి సురేష్ దుల్కర్ సన్మాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ నిర్

Advertiesment
అశ్వినీదత్‌కు ఎంత ధైర్యముంటే 'మహానటి'ని నిర్మిస్తారు : కె.రాఘవేంద్ర రావు
, బుధవారం, 9 మే 2018 (16:35 IST)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం "మహానటి". కీర్తి సురేష్ దుల్కర్ సన్మాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈ సినిమాను తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు వీక్షించారు. సినిమా చూసిన అనంత‌రం ట్విట‌ర్ ద్వారా 'మ‌హాన‌టి' చిత్ర యూనిట్‌ను అభినందించారు. సినిమా అద్భుతంగా ఉంద‌ని కొనియాడారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
'28 ఏళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజున "జ‌గ‌దేకవీరుడు.. అతిలోక సుంద‌రి" సినిమా విడుద‌లైంది. తుఫాను ప్రభావంతో భారీ వ‌ర్షం. భారీ బ‌డ్జెట్‌తో పెద్ద సినిమా తీశాం. ఈ తుఫానులోఎలా ఆడుతోంద‌న‌ని చాలా భ‌య‌ప‌డ్డాం. సినిమా విడుద‌లైన సాయంత్రం నుంచి థియేటర్ల‌లో వ‌రద మొద‌లైంది. ఆ రోజు మా అశ్వ‌నీద‌త్‌కు ఎంత ఆనందం క‌లిగిందో మాటల్లో చెప్ప‌లేను. అదే రోజున ఇప్పుడు 'మ‌హాన‌టి' విడుద‌లైంది. ఎంతో ధైర్యంతో ఈ సినిమాను వైజ‌యంతీ మూవీస్ తెర‌కెక్కించింది. సావిత్రిగా కీర్తి సురేష్ జీవించింది.. జెమినీ గ‌ణేష‌న్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ అద్భుతంగా న‌టించాడు. నాగ్ అశ్విన్, చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్ష‌లు" అని రాఘ‌వేంద్ర రావు ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#PadiPadiLecheManasuలో #SaiPallavi లుక్ ఇదే..