Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"బ‌న్నీ" తదుప‌రి చిత్రం ఎవ‌రితో..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌స్తుతం స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. అయితే... బన్నీ నెక్ట్స్ మూ

Advertiesment
, బుధవారం, 9 మే 2018 (09:31 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప్ర‌స్తుతం స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. అయితే... బన్నీ నెక్ట్స్ మూవీ ఏంటి..? అనేది ఆస‌క్తిగా మారింది. మిగిలిన హీరోలు ఒక సినిమా సెట్స్‌పై ఉండ‌గానే రెండో సినిమా ఏంటి అనేది ఫిక్స్ చేసుకుంటున్నారు. కానీ... బ‌న్నీ లేటెస్ట్ మూవీ రిలీజైంది. ప్ర‌స్తుతం బ‌న్నీ ఖాళీ కానీ.. త‌దుప‌రి చిత్రం ఏంటి అనేది మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయ‌లేదు.
 
బ‌న్నీ - సుకుమార్ ఎంత క్లోజో అనేది అంద‌రికీ తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి 'ఆర్య‌', 'ఆర్య 2' సినిమాలు చేసారు. వీరిద్ద‌రు క‌లిసి సినిమాలు చేయ‌క‌పోయినా.. రెగ్యుల‌ర్‌గా క‌లుస్తూనే ఉంటారు. అయితే.. బ‌న్నీ నెక్ట్స్ మూవీని సుకుమార్‌తో చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ సుకుమార్ మ‌హేష్‌తో సినిమా చేస్తున్నాడు. 
 
ఇటీవ‌ల "భ‌ర‌త్ అనే నేను" సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన కొర‌టాల శివ‌తో బ‌న్నీ మూవీ ఫిక్స్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి కానీ.. కొర‌టాల చిరంజీవితో కానీ... ప్ర‌భాస్‌తో కానీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలిసింది. 
 
సుకుమార్ కాదు.. కొర‌టాల కాదు.. మ‌రి.. బ‌న్నీ నెక్ట్స్ మూవీ డైరెక్ట‌ర్ ఎవ‌రు అంటే విక్ర‌మ్ కె.కుమార్ పేరు వినిపిస్తోంది. విక్ర‌మ్ క‌థ‌లు ఎంత కొత్త‌గా ఉంటాయో తెలిసిందే. ఇటీవ‌ల బ‌న్నీకి విక్ర‌మ్ క‌థ చెప్పాడ‌ని.... న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబద్దాలతో ప్రధాని మోడీ సరికొత్త రికార్డు : ప్రకాష్ రాజ్ ధ్వజం