దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (12:43 IST)
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ముందుగా చెప్పినట్టుగానే బుధవారం కీలక ప్రకటన చేశారు. క్వాంట్ ఏఐ గ్లోబల్‌తో కలిసి ఏఐ స్టూడియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అధునాత ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మే 4వ తేదీన ప్రకటిస్తామని వెల్లించారు. 
 
ఈ విషయాన్ని తెలియజేస్తు దిల్ రాజు కంపెనీ వదిలిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సినిమాల్లో ఏఐ టెక్నాలజీకి సంబంధించిన పనులు చేసే 'క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌'తో కలిసి.. తన కొత్త ఏఐ స్టూడియోను ప్రారంభించబోతున్నట్లు వీడియో ద్వారా తెలియచేశారు. సినిమా ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన మార్పులను ఈ వీడియోలో చూపించారు. ఇప్పుడు ఏఐ అన్నిరంగాలను శాసిస్తుండటంతో... దిల్ రాజు ఈ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు.
 
సాధారణంగా, దిల్ రాజు ఏడాదికి క‌నీసం ఆరేడు సినిమాలు తీయ‌గ‌ల స‌త్తా ఉన్న నిర్మాత‌. సో త‌న సొంత సినిమాల‌న్నింటిలో ఇప్పుడు ఏఐ  టెక్నాలజీతో ఉపయోగించే ఛాన్స్ కనిపిస్తోంది. డబ్బింగ్ నుంచి విజువల్ ఎఫెక్స్ వరకూ ఎలాంటి వర్క్ నైనా ఏఐతో చేసుకునే అవకాశం ఉంది. అందుకే టాలీవుడ్‌కు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‎గా  ఉన్నారు. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ, పంపిణీ చేస్తు బిజీగా ఉన్న ఆయన కొత్త కంపెనీకి శ్రీకారం చుట్టడం ఆయన ముందు చూపును తెలియచేస్తోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments