Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Advertiesment
chiranjeevi - raghavendra - venkatesh

ఠాగూర్

, ఆదివారం, 30 మార్చి 2025 (12:15 IST)
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. ఇందులో చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొని, చిత్ర బృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ పూజా కార్యక్రమంలో హీరో వెంకటేశ్, నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్ర రావు, వశిష్ట, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాత్ ఓదెల, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వెంకటేష్ క్లాప్ కొట్టారు. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్‌తో అనిల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, చిరంజీవి తనయ సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ మూవీలో చిరంజీవి ఒరిజినల్ పేరు శివశంకర వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండగా, ఓ పాత్ర కోసం అదితి రావు హైదరీని ఎంపిక చేయగా మరో పాత్ర కోసం హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. అలాగే, ఈ చిత్రానికి భీమ్స్ సంగీత స్వరాలు సమకూర్చనున్నారు. 
 
జూన్ లేదా జూలై నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లి వచ్చే యేడాది సంక్రాతికి విడుద చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు మెగా 157 అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. కాగా, ప్రస్తుతం "విశ్వంభర" చిత్రంలో నటిస్తున్న చిరంజీవి.. దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెల్సిందే. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది