Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

దేవీ
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (11:53 IST)
Pooja Hegde
పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే తెలుగు సినిమాలో కనిపించి దాదాపు మూడు సంవత్సరాలు అయింది. అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ కాంబినేషన్ లో అలరించింది. ఇక ఆ తర్వాత చివరి సినిమా ఆచార్య. ఆ సినిమా నిరాశపరిచిన తర్వాత, ఆమె బాలీవుడ్ వైపు దృష్టి సారించి, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో హై-ప్రొఫైల్ ప్రాజెక్టులపై పనిచేసింది.
 
తాజాగా, ఆమె సూర్య సరసన తమిళ చిత్రం రెట్రో లో నటించింది. మే 1న సినిమా విడుదలకాబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రమోషన్లను ప్రారంభించింది, ఇది ఇప్పటికే అభిమానులలో గణనీయమైన సంచలనాన్ని సృష్టిస్తోంది. తెలుగు సినిమా నుండి తాను దూరంగా ఉన్నానని ప్రస్తావిస్తూ,  "నా అంచనాలకు సరిపోయే సరైన స్క్రిప్ట్ నాకు దొరకడం లేదు. అందుకే గేప్ తీసుకున్నానంటూ... ఇటీవలే కొత్త తెలుగు ప్రాజెక్ట్‌పై సంతకం చేశానని ఆమె ధృవీకరించింది, అయితే ప్రస్తుతానికి ఆమె వివరాలను గోప్యంగా ఉంచుతోంది. "నేను దానిని సరైన సమయంలో ప్రకటిస్తాను" అని చిరునవ్వుతో వ్యక్తీకరించింది.
 
కాగా, అల్లు అర్జున్ తాజా సినిమాలో ఆమె నటించనుందనే వార్తలు ఇటీవలే షికారు చేశాయి. రామ్ చరణ్ తో కూడా నటించబోతోందని కూడా వార్తలు వచ్చాయి. మరి ఏ సినిమాలో నటిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

Low Pressure: బంగాళాఖాతంలో నవంబర్ 19 నాటికి అల్పపీడనం

నిద్రపోతున్నప్పుడు భారీ వస్తువుతో దాడి.. టైల్ కార్మికుడు హత్య.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments