Dil Raju Allu arvind and Fncc members
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, భాస్కర్ నాయుడు, జె. బాలరాజు, ఏడిద రాజా, వేణు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. అలాగే కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ తదితరుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి ఘన సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ మాజీ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ రాజశేఖరరెడ్డి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, డా. కె. వేంకటేశ్వరరావు, ఎఫ్ఎన్ సీసీ గత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ, ఎఫ్ ఎన్ సీసీ లీజ్ గడువు మరో మూడేళ్లలో ముగుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ లీజ్ ను పొడగించాలని కోరుకుంటున్నా. సీఎం గారు కూడా మన క్లబ్ మెంబరే. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు డెవలప్ చేయాలనుకుంటున్న ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాలతో ఫిల్మ్ సిటీ కూడా నిర్మిస్తే ఇండస్ట్రీలో రాబోయే తరాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. దిల్ రాజు గారు ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ - ఎఫ్ ఎన్ సీసీ మనకున్నబెస్ట్ క్లబ్. సిటీ మధ్యలో ఉంటూ మనకు వ్యాయామం, ఎంటర్ టైన్ మెంట్ కోసం బాగా ఉపయోగపడుతోంది. నేను 1996 లో ఎఫ్ ఎన్ సీసీ క్లబ్ సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుంచి దాదాపు ఈ 30 ఏళ్లలో ఎఫ్ఎన్ సీసీ ఎంతో అభివృద్ధి చెందింది. అందుకు కేఎల్ నారాయణ గారు, కేఎస్ రామారావు గారు వారి కమిటీ సభ్యులు ఎంతో కృషి చేశారు. కేఎస్ రామారావు గారు చెప్పినట్లు ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. అది చాలా చిన్న విషయం ఒప్పుకుని చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరబాద్ ను ప్రపంచానికి ఫిల్మ్ హబ్ గా చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఫిల్మ్ సిటీ ప్రతిపాదన కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా. అన్నారు.