Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Advertiesment
Bramhi, saptagiri, maruthi and others

దేవీ

, గురువారం, 20 మార్చి 2025 (10:27 IST)
Bramhi, saptagiri, maruthi and others
సప్తగిరి, 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.  మార్చి 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
 
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ వేడుకకి రావడానికి ప్రధాన కారణం సప్తగిరి. చిరంజీవి గారు మొన్న బ్రహ్మ ఆనందం ఈవెంట్ కి ఇన్విటేషన్ లేకుండానే నేనే వస్తానని వచ్చారు. పెద్దవాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. రీసెంట్ గా  ఆ విషయం నేర్చుకున్నాను కాబట్టే ఈ వేడుకకి ఏ ఇన్విటేషన్ లేకుండా వచ్చాను. తమ్ముడు సప్తగిరి సినిమా ఇది.  తమ్ముడు కంటే ఒక హాస్య నటుడు సినిమా హిట్ కావాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా కోసం సప్తగిరి చాలా శ్రమ పడ్డాడు. గత 15 రోజులుగా ఏకాకిగా తిరిగాడు. అందరితో కలిసిపోయి తన ప్రతిభని ప్రదర్శించి కనిపించి కనిపించని అందరి దేవుళ్ళని మొక్కుకున్నాడు. విజయం సాధిస్తే  సినిమాని నమ్ముకుని వచ్చిన నేను హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతాను అని చెప్పాడు. ఈ మాట మీతో పంచుకోవాలని ఈ వేడుకకు వచ్చాను. 
 
ప్రేక్షకుల్ని పదికాలాలపాటు నవ్వించాలనే తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడుది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది. నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. ఇందులో అన్నపూర్ణమ్మ ఉంది. తనని అప్పా అని పిలుస్తాను. ట్రైలర్లో ఆమెని చూశాక ఒక 40 ఏళ్ల జర్నీ గుర్తుకొచ్చింది. పెళ్ళికాని ప్రసాద్ సినిమాని మంచి హిట్ చేసి మంచి హాస్యనటుడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అన్నారు.
 
సప్తగిరి మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారి మాటలతో నా మనసు బరువెక్కింది. ఇది జీవితంలో మర్చిపోలేని రోజు. గురువుగారికి పాదాభివందనం. మారుతి అన్న నన్ను వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. నా జీవితం మారుతి అన్నతోనే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి అండ దండ కొండ లాగా నిలబడటం జీవితంలో మర్చిపోలేను. మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత ఎస్కేన్ గారికి థాంక్యూ. ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న హర్షిత్ రెడ్డి గారికి థాంక్యూ. ఎస్విసిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వారికి రుణపడి ఉంటాను. దాదాపు ఏడాదిగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి చాలా అద్భుతంగా తీశాడు చాలా రోజుల తర్వాత నాకు మంచి కంటెంట్ తో ఉన్న సినిమాని ఇచ్చాడు. 
 
100% థియేటర్స్ లో ఆడియన్స్ ని నవ్విస్తాం. 20 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. కమెడియన్ గా మీ గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేశాను. హీరోగా మంచి సినిమాలు చేశాను. ప్రతిసారి నన్ను నేను నిలబెట్టుకోవడానికి చేసిన యుద్ధంలో ఇండస్ట్రీ, ఆడియన్స్ నాకు అండగా ఉన్నారు. ప్రభాస్ అన్న, వెంకటేష్ గారు, మారుతి అన్న, ఎస్కేన్ గారు దిల్ రాజ్, గారు శిరీష్ గారు, హర్షిత్ అన్న, అనిల్ రావిపూడి అన్న ఇంతమంది గొప్ప వ్యక్తుల బ్లెస్సింగ్స్ మా సినిమాకి దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను'అన్నారు
 
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. చిన్న సినిమా సక్సెస్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా మంచి హిట్ అయి ఆడియన్స్ అందరూ థియేటర్స్ కి వచ్చిన సినిమా చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. ఇదే మార్చిలో ఈ రోజుల్లో సినిమా విడుదలై జనాలందరూ గొప్పగా ఆదరించారు. మంచి కంటెంట్ ఇస్తే ఎప్పుడూ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుందని ప్రూవ్ చేశారు. సప్తగిరి హీరోగా చేస్తుంటాడు. కమెడియన్ గా చేస్తుంటాడు. పెళ్లి కాని ప్రసాద్ కథ చాలా బాగుందని తను బిగినింగ్ నుంచి చెప్తూ వచ్చాడు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసే సినిమా. ఇది సినిమాలో కంటెంట్ హీరో అని నమ్మి వెళితే ఈ సమ్మర్ లో ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న