Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

Advertiesment
Sapthagiri

దేవీ

, గురువారం, 13 మార్చి 2025 (18:03 IST)
Sapthagiri
సప్తగిరి హోల్సమ్ ఎంటర్ టైనర్ 'పెళ్లి కాని ప్రసాద్' మార్చి 21న థియేటర్లలోకి రానుంది. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్ , సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఈరోజు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
 
ప్రసాద్ కి 36 ఏళ్ళు దాటుతాయి. పెళ్లి గురించి మరింత ఆందోళన చెందుతాడు. అతను ఏజ్ బార్ గా భావిస్తున్నప్పటికీ, కాలక్రమేణా ఎక్కువ అనుభవం వస్తుందని అతని తండ్రి అతనికి భరోసా ఇస్తాడు. అయినప్పటికీ, ఇంకేదైనా ఆలస్యం జరిగితే ఇక అవకాశం వుండదని ప్రసాద్ భయపడతాడు. మరోవైపు, హీరోయిన్ కుటుంబం తనకు మద్దతు ఇవ్వడమే కాకుండా, తన మొత్తం కుటుంబాన్ని పోషించగల వరుడి కోసం వెతుకుతోంది. వీరిని విధి ఒకచోట చేర్చుతుందా? అనేది ట్రైలర్ లో చాలా ఎక్సయిటింగ్ అండ్ హిలేరియస్ గా ప్రజెంట్ చేశారు.
 
పెల్లి కాని ప్రసాద్  టైటిల్ పాత్రలో సప్తగిరి తన హ్యుమరస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రియాంక శర్మకు మంచి పాత్ర లభించింది. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ పాత్రలు కామెడీ పోర్షన్ ని మరింత పెంచింది.
 
సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ సినిమా ఎంటర్టైమెంట్ ప్రిమైజ్ ని అద్భుతంగా చూపిస్తోంది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సంగీతం హ్యుమర్ ని మరింత ఎలివేట్ చేసింది. ఎడిటర్ మధు.
 
మొత్తం మీద, పెళ్లి కాని ప్రసాద్ ప్రేక్షకులను నవ్విస్తూ సామాజిక నిబంధనలను ప్రజెంట్ చేసే ఎంటర్ టైనింగ్ ఔటింగ్ గా ఉండబోతోంది.
 
తారాగణం: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్