Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని వుంది : జూనియర్ ఎన్టీఆర్

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (10:29 IST)
తమిళంలో తనకు ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్ అని, ఆయన దర్శకత్వంలో తమిళ స్ట్రైట్ చిత్రంలో నటించాలని వుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆయన తాజా చిత్రం "దేవర". కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కూపర్ హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ సంగీతం. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, మంగళవారం రాత్రి చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ, దేవర సినిమాకు పని చేసిన వారి కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోనన్నారు. ఈ సినిమా అందరికీ ప్రత్యేకమేనని చెప్పారు. చెన్నె అంటే తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. బాల్యంలో కూచిపూడి నృత్యం ఇక్కడే నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. దేవరకు మూలస్తంభాలైన (దర్శకుడు, సినిమాటో గ్రాఫర్ తదితరులు) వారితో వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
 
మన భాషలు వేరు కావొచ్చు కానీ మనందరినీ ఒక్కటిగా చేసేసింది సినిమానే అన్నారు. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ అనేవి పేరుకు మాత్రమేనని, ప్రేక్షకులంతా ఒక్కటేనని బాక్సాఫీసు వద్ద ఎన్నో సినిమాలు నిరూపించాయన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తొలి అడుగు పడింది చెన్నెలోనేనని అన్నారు. సినిమా ప్రమోషన్స్‌కు చెన్నె కూడా కీలకంగా మారిందన్నారు. వెట్రిమారన్ సర్ .. తమిళ్ సైతం తనకు ఒక సినిమా చేయాలని, తాము దాన్ని తెలుగులో డబ్ చేసుకుంటామని పేర్కొంటూ ఆ దర్శకుడిపై ఎన్టీఆర్ అభిమానాన్ని చాటుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments