Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కష్టానికి తగ్గ పారితోషికం తీసుకున్నా - భయమే దేవర కథకు మూలం: ఎన్.టి.ఆర్.

Devara latest poster

డీవీ

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (11:39 IST)
Devara latest poster
ప్రస్తుతం ఎన్.టి.ఆర్. నటించిన దేవర సినిమా గురించి అంతా చర్చ జరుగుతోంది. రెండు భాగాలుగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి భాగం ఎండింగ్ లోనే రెండో భాగం చూడాలనే ఆసక్తి కలుగుతుందని ఎన్.టి.ఆర్. తెలియజేశారు. ఇటీవల ముంబై ప్రమోషన్ లో భాగంగా చిత్ర టీమ్ కు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా వారి పారితోషికంపై పలు రకరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై వారంతా ఒకే సమాధానం చెప్పడం విశేషం. కష్టానికి తగ్గ పారితోషికం తీసుకున్నామ్ అని చెప్పడం కొసమెరుపు. 
 
అయితే ఎన్.టి.ఆర్. ఇంతకుముందు రాజమౌళితో చేసిన ఆర్.ఆర్.ఆర్. సినిమాకు 45 కోట్లు తీసుకున్నట్లు తెలిసింది. దేవరకు మాత్రం 60 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ఇండస్ట్రీలో నెలకొంది. అలా అని మిగిలిన నటీనటులు కూడా తక్కువేమి కాదు. జాన్వీకపూర్ 5 కోట్లు, సైఫ్ అలీఖాన్ 10 కోట్లు, ప్రకాష్ రాజ్ 1. 50 కోట్లు తీసుకున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
కాగా, సినిమాలోని పాయింట్ గురించి ఎన్.టి.ఆర్. చెబుతూ, భయమే కథను నడుతుతుంది. ఆ భయంతోపాటు యాక్షన్ డ్రామా చాలా కీలకం. 80 దశకంలో కోస్తా తీరంలో ఇండియాలో చాలా వెనుకబడిన ప్రాంతాలున్నాయి. అక్కడ గ్రామదేవతలను పూజిస్తారు. వారు దేనికైనా తెగిస్తారు. అది ఎలాఅనేది కొరటాల శివ అద్భుతంగా చూపించారని అన్నారు.
 
ఇదిలా వుండగా, USA అంతటా కీర్తి వెలుగులు నింపుతోంది దేవర చిత్రం వసూళ్ళు. ప్రీమియర్స్‌కి 10 రోజులు మిగిలి ఉన్న రికార్డు సమయంలో 45,000+ టిక్కెట్లు అమ్ముడవడంతో  దేవర USA తీరంలో దూసుకుపోతుంది అని చిత్ర టీమ్ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్ర హీరోలకు ఫ్లాఫ్ బ్యాక్ కు వాడే విఎఫ్ ఎక్స్ టెక్నాలజీ బెడిసికొడుతుందా?