Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగ్ర హీరోలకు ఫ్లాఫ్ బ్యాక్ కు వాడే విఎఫ్ ఎక్స్ టెక్నాలజీ బెడిసికొడుతుందా?

VFX techalogy for hore photos

డీవీ

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (10:34 IST)
VFX techalogy for hore photos
మారుతున్న టెక్నాలజీని సినిమారంగంలో సరైనవిధంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు తీయవచ్చు. హాలీవుడ్ సాంకేతికను అందింపుచ్చుకుని అవతార్ వంటి పలు చిత్రాలు వచ్చాయి. వాటిని బేస్ చేసుకుని ఇటీవలే ప్రభాస్ తో కల్కి సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. అందులో గ్రీన్ మాట్ తో సరస్సులు, కొండలు, శంబాలి, కాంప్లెక్స్ వంటి నగరాలను మైమరిపించే విధంగా తీయడం ఒక భాగం.

అయితే గతానికి వర్తమానికి కంపేర్ చేస్తూ ఆయా పాత్రలను మలచడం అనేది సాహసమే. అందుకే ఆ సినిమాలో పురాణకాలంనాటి వేల సంవత్సరాల అశ్వత్థామ పాత్రను అమితాబ్ బచ్చన్ చేత వేయించాడు దర్శకుడు. మరి వర్తమానంలో ఎలా వుంటాడో చూపించాడు. కానీ పురాణకాలంనాటి అశ్వత్థామను వయస్సు తగ్గినట్లుగా చూపించి నెరేషన్ లో సక్సెస్ అయ్యాడు.
 
తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ సీనియర్ హీరోలకు వయస్సు కనిపించకుండా డ్యూయల్ రోల్ చేయాలంటే దానికి కసరత్తు చేయాల్సి వుంటుంది. ప్రతి కథలో హీరోకు ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్ వుంటుంది. అయితే రజనీకాంత్ కు కాస్త ఊరట అని చెప్పవచ్చు. ఆయన ఆహార్యం కూడా కలిసి వచ్చింది. కానీ అందరికీ అలా కుదరదు. 
 
 గతంలో దర్శకుడు శంకర్ కూడా భారతీయుడు సినిమాలో యంగ్ కమల్, ఓల్డ్ కమల్ లో వేరియేషన్ లో చూపించి సక్సెస్ అయ్యాడు. కానీ అదే శంకర్ దశాబ్దం తర్వాత సీక్వెల్ గా తీసిన భారతీయుడు 2లో మాత్రం సరైనవిధంగా మలచలేకపోవడమేకాకుండా.. యంగ్ కమల్ ప్లేస్ లో సిద్దార్థ్ ను పెట్టి తెలివిగా కథను రాసుకున్నాడు. ఎందుకంటే వి.ఎఫ్.ఎక్స్ టెక్నాలజీ మరలా కమల్ ను చూపించడం పెద్దగా ఆకట్టుకోదని ఆయన ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. 
 
కానీ కొందరు దర్శకులు మాత్రం హీరో ఇమేజ్ ను దెబ్బతీయకుండా వయస్సు మల్లిన హీరోను యంగ్ హీరోగా చేయడానికి టెక్నాలజీ తప్పలేదు. అందులో భాగంగానే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా బెదిసి కొట్టింది. కథే పెద్దగా ఆకట్టుకోకపోవడంతోపాటు ముప్పై ఏళ్ళ చిరంజీవిని డా.జి. టెక్నాలజీ ఉపయోగించి అభిమానుల్లోనూ నిరాశ కలిగించారు. దానిని స్పూర్తిగా తీసుకున్న రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావులో కూడా యంగ్ రవితేజగా ట్రై చేశాడు. కానీ ఆ గెటప్ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతోపాటు చూడ్డానికి కాస్త ఇబ్బందికరంగా తయారైంది. 
 
ఇక బాలీవుడ్ లో షారూఖ్ కాన్ కూడా పలు ప్రయోగాలు చేశాడు. తాజాగా ఇటీవలే విడుదలైన తమిళ స్టార్ విజయ్ కూడా గోట్ అనే పేరుతో సినిమా వచ్చింది. అందులో ఈ టెక్నాలజీతో యంగ్ హీరో విజయ్ గా చూపించారు. దానికి ఒక్క తమిళనాడు మినహా అన్ని చోట్ల సినిమాను తిప్పి కొట్టారు. ఎంత వయస్సు వచ్చినా కనబడనట్లు వుండే విజయ్ పై కాలేజీ కుర్రాడిలా చూపించాలనుకోవడం పెద్ద పొరపాటనేది ఇండస్ట్రీలో నెలకొంది. తాజాగా నాగార్జున నటిస్తున్నకుబేర సినిమాలోనూ నాగ్ పాత్ర తీరు కూడా కాస్త భిన్నంగా వుంది. అందుకే ఆయన పాత్రను బ్లాక్ అండ్ వైట్ ఫొటోతోపాటు, చీకటిలో వుండే ఫేస్ లను ప్రమోషన్ లో వాడుతున్నారు.
 
 కనుక విఎఫ్ ఎక్స్ కు చెందిన డా.జీ. అనే సాంకేతికను ఉపయోగించుకోవాలంటే దానిపై దర్శకుడికి కాస్త అవగాహన వుండాలి. ఇవన్నీ బాగా తెలిసిన రాజమౌళి మాత్రం ఆ జోలికి వెళ్ళకుండా తగు జాగ్రత్తలతో సినిమా తీయడం విశేషం. ఇకనైనా అగ్ర హీరోలను యంగ్ హీరోలుగా తీస్తే ప్రేక్షకులు చూస్తారనుకోవడం ఇది 70, 80 దశకం కాలం కాదని  నేటి యువ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?