Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్ఆర్ఆర్‌ రికార్డును అధికమించిన కల్కి 2898ఏడీ!!

Advertiesment
Kalki 2898 AD

వరుణ్

, సోమవారం, 22 జులై 2024 (15:44 IST)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "కల్కి". గత నెల 26వ తేదీన విడుదలై ఇప్పటికీ విజయవతంగా ప్రదర్శితమవుతుంది. అయితే, ఈ చిత్రం గతంలో జూనియర్ ఎన్టీఆర్, రాణ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రం హిందీ  రికార్డులను అధికమించింది. 
 
గత 25 రోజుల రన్‌ టైమ్‌ ముగిసేసరికి ఇండియాలో రూ.600 కోట్ల వసూళ్లు దాటింది. హిందీలో "ఆర్‌ఆర్‌ఆర్‌" రూ.272 ​​కోట్లు వసూలుచేయగా నాలుగు వారాల్లో 'కల్కి' 2898 ఏడీ రూ.275.9 కోట్లు వసూలుచేసినట్లు ట్రేడింగ్‌ వర్గాలు అంచనా వేశాయి. 
 
అలాగే, కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద నాలుగో వారాంతంలో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో దక్షిణాది చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన 7వ భారతీయ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు షారుక్‌ ఖాన్‌ నటించిన జవాన్‌ (రూ.640.25 కోట్లు) వసూళ్లను అధిగమించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కల్కి రూ.616.85 కోట్లతో ఇంకా మంచి ఆక్యుపెన్సీతో థియేటర్‌లలో నడుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద కల్కి రేంజ్‌ సినిమాలు లేకపోవడంతో ఈ చిత్రానికి కలిసొచ్చే అంశమని సినీవర్గాలు చెబుతున్నాయి. 
 
హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాలు..
బాహుబలి 2 : రూ.511 కోట్లు
కేజీయఫ్ 2 : రూ.435 కోట్లు
కల్కి 2898 AD : రూ.275.9 కోట్లు
ఆర్‌ఆర్‌ఆర్‌ : రూ.272.78 కోట్లు
 
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. ఇది ఈ ఘనత సాధించిన ఏడో భారతీయ చిత్రం. 2024 సంవత్సరంలో మొదటిది. కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి వసూళ్లు సాధించిన మూడో తెలుగు చిత్రం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హను రాఘవపూడి చిత్రంలో పాకిస్థానీ అమ్మాయితో ప్రభాస్ రొమాన్స్!?