రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (17:00 IST)
తాను సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమానిని అని, ఆయన కోసం కూలీ చిత్రంలో ఆ పని చేసినందుకు తనకు ఎలాంటి ఇబ్బంది అనిపించ లేదని బాలీవుడ్ నటి అమీర్ ఖాన్ వెల్లడించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం "కూలీ". ఈ నంల 14వ తేదీన విడుదలైంది. ఇందులో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఓ పాత్రను పోషించారు. 
 
ఈ నేపథ్యంలోనే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమిర్ ఖాన్ తన పాత్రపై స్పందించారు. "నిజాయతీగా చెప్పాలంటే, 'కూలీ' చిత్రంలో నా పాత్ర రజనీకాంత్‌గారికి బీడీ వెలిగించడం. అలా చేయడం నాకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దాన్ని నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
 
ఒక బాలీవుడ్ అగ్ర హీరో, మరో భాషలోని సూపర్ స్టార్‌తో కలిసి నటించడంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది రజనీకాంత్ పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం మిశ్రమ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, కలెక్షన్ల పరంగా కేవలం నాలుగు రోజుల్లో రూ.400 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments