వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (14:21 IST)
వివాహ వ్యవస్థపై తనకు పెద్దగా నమ్మకం లేదని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. తన పెళ్లి గురించి వస్తున్న ఒక్క స్టేట్మెంట్ ముంగింపు పలికారు. ఆమె వివాహం చేసుకోబోతున్నారంటూ కొంతకాలంగా మీడియా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. 
 
అంతేకాదు, అసలు వివాహ వ్యవస్థపైనే తనకు నమ్మకం లేదంటూ తనదైన శైలిలో ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, "నా పెళ్లి గురించి ఇప్పటివరకు వందల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఏదీ నిజం కాదు. నేను పెళ్లిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వివాహం, కుటుంబం, పిల్లలు అనేవి నా జీవనశైలికి సరిపోవు. వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు" అని స్పష్టం చేశారు. 
 
పెళ్లి కావడం లేదన్న బాధ తనకు ఏమాత్రం లేదని కూడా ఆమె అన్నారు. "ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాలు, రాజకీయాలపైనే ఉంది. ఈ రెండు రంగాల్లోనే నాకు పూర్తి సంతృప్తి లభిస్తోంది" అని కంగనా తన ప్రాధాన్యతలను వివరించారు. నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పే కంగనా, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎప్పటిలాగే కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే, ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని కంగనా తన వైఖరితో చెప్పకనే చెప్పినట్లయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments