Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

Advertiesment
Arjun Chakravarthy Producer Srini Gubbala

దేవీ

, మంగళవారం, 19 ఆగస్టు 2025 (18:45 IST)
Arjun Chakravarthy Producer Srini Gubbala
అర్జున్ చక్రవర్తి సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే క్లారిటీతోనే ఉన్నాను. ఇండియాలోనే మెట్రో ఆడియన్స్ తో పాటు యూఎస్ యూకే యూరప్ సౌత్ ఆఫ్రికా అన్ని చోట్ల ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం. సినిమా రిలీజ్ అయిన మూడు రోజులు తర్వాత కచ్చితంగా మారుమూల గ్రామాల్లో కూడా  వెళుతుందనే నమ్మకం ఉంది. ఇందుకోసం హీరో ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ లో ఆడిన వారిని తీసుకున్నాం అని నిర్మాత శ్రీని గుబ్బల తెలిపారు.
 
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీని గుబ్బల సినిమా విశేషాలు పంచుకున్నారు.  
 
- తొలి సినిమాని స్పోర్ట్స్ డ్రామాగా తీసుకోవడానికి కారణం క్రియేటివ్ గా ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటివరకు కొన్ని కథలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపిస్తున్నంత సీరియస్ గా ఇప్పటివరకు సినిమా రాలేదు. కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అవుతుందని చాలెంజ్ గా తీసుకుని సినిమా చేశాం.  
 
- నల్గొండలో కబడ్డీ ప్లేయర్ నాగులయ్య. అతనిని అర్జున్ అని కూడా పిలుస్తారు. ఆయన అద్భుతమైన ప్లేయర్. ఆయన జీవితంలో ట్రూ ఈవెంట్స్ 60 % ,  40% ఫిక్షన్ తో ఈ కథని చేయడం జరిగింది. సినిమా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది.
 
- ఈ సినిమాని చేయడానికి ఎక్కువ కాలం పట్టింది. కారణం ఈ కథ అలాంటిది. హీరోకి  నాలుగైదు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి.  అన్ని మెయిన్ క్యారెక్టర్స్ కి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ కి ట్రాన్స్ఫర్మేషన్ 9 నెలలు పట్టేది.  
 
- ఇలాంటి కథని ఒక స్టార్ హీరో తో చేస్తే, దానికోసం చాలా సమయాన్ని కేటాయించాలి.  అంతా సమయం కేటాయించే వీలు అందరికీ ఉండదు. అలాగే సినిమాని అథెంటిక్ గా తీసి ఇంటర్నేషనల్ గా తీసుకెళ్లాలని మేము భావించాం. ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శిస్తున్నప్పుడు అందరూ చాలా అభినందించారు.
 
- ప్రొడక్షన్లో చాలా విషయాలు నేర్చుకున్నా. అనుకున్న బడ్జెట్ కి ఫైనల్ గా వచ్చే బడ్జెట్ కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. బడ్జెట్ పెరుగుతుంది. అయితే క్వాలిటీలో రాజీ పడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించడం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహిత్ వర్మ, రియా సుమన్ జంటగా నూతన చిత్రం ప్రారంభం