Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా థియేటర్ కార్మికుల నిరసన దీక్ష, లాక్ డౌన్‌లో జీతాలివ్వలేదనీ...

Webdunia
సోమవారం, 18 మే 2020 (18:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్స్‌లో పనిచేసే కార్మికులకు లాక్ డౌన్ కాలంలో పూర్తి వేతనాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్( సి ఐ టి యు ) ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి వెంకటేష్, పాలడుగు భాస్కర్ ప్రారంభిస్తూ కరోనా వైరస్ మూలంగా గత రెండు నెలలుగా లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం, పనిచేసే కార్మికులందరికీ లాక్ డౌన్ కాలానికి పూర్తి జీతం ఇవ్వాలని జీవో నెంబర్ 45 తీసుకు రావడం జరిగింది.
 
కానీ సినిమా థియేటర్ యజమానులు ధియేటర్లో పనిచేసే కార్మికులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను లెక్కచేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకొని కార్మికులకు సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము.
 
అదేవిధంగా రాష్ట్రంలోని కొన్ని థియేటర్స్‌లో లాక్ డౌన్ పేరుతో కార్మికులను పనిలో నుంచి తొలగిస్తున్నారు. కార్మికులకు ఇచ్చే వేతనంలో 40 - 50 శాతం వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. లాక్ డౌన్‌తో రాష్ట్రంలో సినిమా ధియేటర్లో పనిచేసే 20,000 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్స్ పనిచేసే కార్మికులకు నిత్యావసర సరుకులు అలాగే ఏడు వేల 5 వందల రూపాయలు అందించవలసిందిగా ప్రభుత్వాని కోరుతున్నాము.
 
ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం మారన్న, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి పుల్లారావు, కె అరుణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్రెడ్డి, శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కే సత్తయ్య, నాయకులు సుధాకర్, సురేష్ ఐనాక్స్ రాజు, కోటేశ్వరరావు శ్రీనివాస్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments