Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - రానా కలిసి మరో సినిమా చేయనున్నారా? డైరెక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (17:28 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దగ్గుబాటి రానా కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి చరిత్ర సృష్టించడం తెలిసిందే. బాహుబలి తర్వాత ఓ వైపు ప్రభాస్, మరోవైపు రానా ఇద్దరూ వేరే సినిమాలతో బిజీ అయ్యారు.
 
ఈ ఇద్దరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ... కెరీర్లో దూసుకెళుతున్నారు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ - రానా కలిసి సినిమా చేయనున్నారు అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. 
 
ఇంతకీ విషయం ఏంటంటే... ప్రభాస్‌తో దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా తీసారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది.
 
అయితే... మిస్టర్ పర్ఫెక్ట్ తీసిన దర్శకుడు దశరథ్ ఇటీవల ప్రభాస్‌కి ఓ కథ చెప్పారని తెలిసింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు రానా అయితే కరెక్ట్‌గా సరిపోతాడని.. రానాని కాంటాక్ట్ చేసి కథ చెప్పాడని టాక్. ఈ కథ విని రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
 
 దీంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments