Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటో జర్నలిస్టుకు ఆర్థికసాయం చేసిన చిరంజీవి

Webdunia
ఆదివారం, 23 మే 2021 (18:13 IST)
క‌రోనా క‌ష్ట‌కాలంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ద్వారా సినీకార్మికుల‌ను మెగాస్టార్ చిరంజీవి ఆదుకుంటున్నారు. ఇటీవ‌ల క‌ష్టంలో ఉన్న పావ‌ల శ్యామ‌ల‌కు, అలాగే కోరోనాతో మృతి చెందిన ప‌లువురు వీరాభిమానుల కుటుంబాల‌ను ఆదుకున్నారు. 
 
అలాగే కోరోనా వచ్చి ఇబ్బంది పడుతున్న అభిమానులకు కూడా ఆయన లక్షలాది రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు. తన అభిమాన వార‌సులు పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా సేవ‌ల్ని అనంతంగా చేస్తున్నారు.
 
ఇంత‌కుముందు ఎన్నోసార్లు ఎంతోమంది జ‌ర్న‌లిస్టుల‌కు సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫోటో జ‌ర్న‌లిస్ట్ అనారోగ్యంతో ఉన్నార‌ని ఆదుకోవాల‌ని కోర‌గా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. 
 
ఈ చెక్కును చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు భరత్ భూషణ్‌కు అందజేశారు. సాయం అందుకున్న భ‌ర‌త్ భూష‌ణ్ మాట్లాడుతూ.. ఆప‌ద్భాంద‌వుడిలా ఈ క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో సాయం చేస్తున్న చిరంజీవి గారు.. క‌ష్టంలో మ‌మ్మ‌ల్ని ఆదుకున్నందుకు రుణ‌ప‌డి ఉన్నాము. ఆయ‌న పెద్ద‌మ‌న‌సుకు కృత‌జ్ఞ‌త‌లు” అని అన్నారు. 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments