పొద్దస్తమానం కేసులేనా... కరోనా పాజిటివ్ రేట్ గురించి మాట్లాడుదాం.. రేణూ దేశాయ్ \

Webdunia
ఆదివారం, 23 మే 2021 (17:40 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి పెరిగింది. ఇపుడు క్రమంగా తగ్గుతోంది. ఏ టీవీ  చానెల్ పెట్టినా కరోనా కేసుల పెరుగుదల గురించిన వార్తా కథనాలే ప్రసారం అవుతున్నాయి. అలాగే, కరోనా మరణాలు, ఆక్సిజన్ కొరత వంటి ఇతర ప్రతికూల అంశాలనే మాట్లాడుతున్నారు. వీటిపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ విచారం వ్యక్తం చేశారు. 
 
ఇది సరైన దృక్పథం కాదని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో సానుకూల అంశాలను చర్చించాలని, మనకు ప్రస్తుతం రికవరీ రేట్ ఎంతో మెరుగుపడిందని, అలాంటి ఉత్సాహం కలిగించే అంశాలను ప్రస్తావించాలని రేణూ దేశాయ్ సూచించారు. తనకు తెలిసిన వాళ్లలో 70 ఏళ్ల వయసున్నవారు కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారని గుర్తుచేశారు.
 
ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు డబుల్ మాస్కులు ధరిస్తూ, శానిటైజేషన్, భౌతికదూరం పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలని కోరారు. అప్పటికీ కరోనా పాజిటివ్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని సూచించారు. మనకు ఎంతో మెరుగైన వైద్య వ్యవస్థ ఉందని, డాక్టర్లపై నమ్మకం ఉంచి చికిత్స పొందాలని రేణూ తెలిపారు.
 
గట్టిగా పోరాడితే కరోనాను జయిస్తారని పిలుపునిచ్చారు. ఈ మేరకు రేణూ దేశాయ్ సందేశంతో కూడిన వీడియోను ఏపీ ప్రభుత్వానికి చెందిన 'ఆరోగ్యాంధ్ర' తన సోషల్ మీడియాలో ఖాతాలో పంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments