Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయ‌న‌కు నేను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను - "సైరా" టీజ‌ర్ వేడుక‌లో చిరంజీవి

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (13:29 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం "సైరా న‌ర‌సింహారెడ్డి". బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చాసుదీప్‌, విజ‌య్ సేతుతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మం ముంబైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు యూనిట్ స‌భ్యులు స‌మాధానం ఇచ్చారు. 
 
1999లో "అజ్‌కా గూండారాజ్" త‌ర్వాత ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ హిందీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.. అందుకు కార‌ణ‌మేంటి?
చిరంజీవి: ఈ గ్యాప్ ఎందుకు వ‌చ్చిందో తెలియ‌డం లేదు. నాకు ప్రాప‌ర్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ రాలేదు. ఆ కార‌ణంగా కొంత గ్యాప్ వ‌స్తే.. త‌ర్వాత నేను రాజ‌కీయాల్లోకి వెళ్లాను. అక్క‌డ నుండి 2016 మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. బాలీవుడ్‌కి రావాల‌ని అనుకున్న‌ప్పుడు ఈ సినిమా అయితే స‌రిపోతుంద‌నిపించింది.
 
`సైరా న‌రంసింహారెడ్డి`తోపాటు అదేస‌మ‌యంలో ఇత‌ర బాలీవుడ్ హీరోల సినిమాలు మ‌రికొన్నివిడుద‌ల‌వుతున్నాయి క‌దా! మీ అభిప్రాయమేంటి?
ప‌ర్హాన్ అక్త‌ర్: అవును నిజ‌మే! అయితే మ‌న‌కు కావాల్సిన‌న్నీ స్క్రీన్స్ ఉన్నాయి. సైరా ఓ గొప్ప చిత్రం. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించారు. ప్రేక్ష‌కులు రెండు సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే రెండు వేర్వేరు సినిమాలు. అంత కంటే నేను వేరే ఆలోచ‌న‌లు చేయ‌డం లేదు. 
 
అమితాబ్ బ‌చ్చ‌న్‌గారితో క‌ల‌సి న‌టించ‌డంపై మీ అనుభూతి ఏంటి? ఇద్ద‌రు మెగాస్టార్స్ తెర‌పై క‌నుల విందు చేయ‌నున్నారా? 
చిరంజీవి: అమితాబ్‌గారు నా రియ‌ల్ లైఫ్ మెంట‌ర్‌. నాకు తెలిసినంత వ‌ర‌కు ఇండియాలో మెగాస్టార్ అంటే అమితాబ్ బ‌చ్చ‌న్‌గారే. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు కూడా ఎవ‌రూ రీచ్ కాలేరు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయడం నా అదృష్టం. ఈ సినిమాలో నా గురువు పాత్ర‌కు అమితాబ్ బ‌చ్చ‌న్‌గారైతే బావుంటుంద‌ని డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి అన్నారు. అదొక‌ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్‌. నేను ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పి.. ఆయ‌న‌కు ఫోన్ చేయ‌గానే .. ఏం కావాలని అడిగారు. ఇలా సైరా సినిమా గురించి చెప్పాను. చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో నా గురువు పాత్ర‌లో మీరు న‌టించాల‌ని, ఓ వారం రోజులు కాల్షీట్స్ కేటాయిస్తే చాలని అన్నాను. వెంట‌నే ఆయ‌న అంగీక‌రించారు. ఆయ‌న‌కు నేను ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను.
 
భారీ చిత్రాల‌ను హిందీ ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు క‌దా!.. ఇలాంటి సినిమాల‌నే చేయాల‌ని ఎలా నిర్ణ‌యించుకుంటారు?
రితేష్ అద్వాని: చ‌రిత్ర‌లో మ‌ర‌చిపోయిన స్వాతంత్ర్యయోధుడి క‌థ‌ను సినిమాగా చేస్తున్నామ‌ని రామ్‌చ‌ర‌ణ్ చెప్ప‌గానే నేను టీజ‌ర్‌ను చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. మ‌రికొన్ని భాగాల‌ను చూశాను. బాగా న‌చ్చాయి. దాంతో హిందీలో సినిమాను రిలీజ్ చేయాల‌నుకున్నాం. భ‌విష్య‌త్‌లో కూడా మంచి సినిమాలు వ‌స్తే.. స్క్రిప్ట్ ద‌శ నుండే పార్ట్ అవుతాం.
 
`బాహుబ‌లి` వంటి భారీ చిత్రం త‌ర్వాత `సైరాన‌ర‌సింహారెడ్డి` వంటి మ‌రో భారీ చిత్రంలో చేయ‌డం ఎలా అనిపించింది?
త‌మ‌న్నా: చాలా సంతోషంగా ఉంది. నేను తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు చిరంజీవిగారితో క‌లిసి న‌టించాల‌ని అనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక నేర‌వేరింది. చ‌ర‌ణ్ ఈసినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. సుస్మిత చాలా క‌ష్ట‌ప‌డింది. పెద్ద పెద్ద స్టార్స్‌తో న‌టించే అవ‌కాశం ఇచ్చిన అంద‌రికీ థ్యాంక్స్‌.
 
చ‌ర‌ణ్ బాలీవుడ్‌లో ఎందుకు న‌టించ‌డం లేదు? 
రామ్‌చ‌ర‌ణ్: ఎంత పెద్ద న‌టుడికైనా కంటెంట్ ఉన్న సినిమా కుద‌రాలి. వ‌చ్చే ఏడాది రాజ‌మౌళి ఆర్‌ఆర్‌ఆర్ మీ ముందుకు రాబోతున్నాను. బాలీవుడ్‌లో నాకు అది క‌మ్ బ్యాక్ మూవీ అనుకుంటున్నాను.
 
మీరు చాలా గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్ సినిమాతో ప్రేక్ష‌కులు ముందుకు వ‌స్తున్నారు క‌దా? మీరు ఎలాంటి మార్పులు గ‌మ‌నించారు? 
చిరంజీవి: నేను 2007లో న‌ట‌న‌కు స్వ‌స్తి చెప్పి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. త‌ర్వాత అక్క‌డ నుండి సినిమాల్లోకి 2016లో రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ కాలంలో సినిమాల్లో చాలా మార్పులు వ‌చ్చాయి. నేను సినిమాలు చేసేట‌ప్పుడు నెగిటివ్ ఉండేది. కానీ ఇప్పుడు అవేం క‌న‌ప‌డటం లేదు. నేను నా 150వ సినిమా చేసేట‌ప్పుడు నాకు కొత్త‌గా అనిపించింది. అంతా కొత్త వాతావ‌ర‌ణం క‌న‌ప‌డింది. అయితే సినిమాలో కంటెంట్‌, సినిమాలో ఎమోష‌న్స్‌లో మార్పు లేదు.
 
అమితాబ్‌, చిరంజీవి వంటి స్టార్స్‌తో సినిమా చేయ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించిందా? 
సురేంద‌ర్ రెడ్డి: ఛాలెంజింగ్‌గానే అనిపించింది. అయితే అమితాబ్, చిరంజీవిగారు నాకు కంఫ‌ర్ట్ జోన్‌ను క్రియేట్ చేశారు. దాని వ‌ల్ల సినిమా చేయ‌డం సుల‌భ‌మైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments