Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులతో దీపావళిని పండుగను ఘనంగా జరుపుకోబోతున్నాం : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (19:25 IST)
Kaif, salman
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా పలు చిత్రాల్లో నటించి ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జోడీగా పేరుని సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఏది దీపావళి ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. తొలిసారి ఈ జోడీ నటించిన ‘టైగర్ 3’ దీపావళికి సందడి చేయనుంది. తమ అభిమానులు, సినీ ప్రేక్షకులనే కాదు యావత్ ప్రపంచానికి వీరు తమ అద్భుతమైన ప్రదర్శనతో మెప్పించబోతున్నారు.
 
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘దీపావళి పండుగకి సిినిమా రిలీజ్ కావటం అనేది ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆరోజుల్లో విడుదలయ్యే చిత్రాలను ప్రేక్షకుల ఆస్వాదించటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలా దీపావళి రోజున విడుదలైన నా చిత్రాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే నాకు, కత్రినాకు ఈ దీపావళి పండుగ మరెంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు మేం కలిసి నటించిన ఏ సినిమా కూడా దీపావళికి రిలీజ్ కాలేదు. తొలిసారి ‘టైగర్ 3’ రిలీజ్ కానుంది. కాబట్టి మేం ఎంతో ఆనందంతో, ఆసక్తికరంగానూ ఎదురు చూస్తున్నాం. దీపావళి అంటే వ్యక్తులే కాదు, కుటుంబాలు కూడా ఒక చోటికి చేరుతాయి. నాకు కావాల్సిన వారితో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవటానికి నేను ఇష్టపడతాను. అలాగే నా కుటుంబ సభ్యులందరితో కలిసి టైగర్ 3 సినిమాను చూస్తాను. అందరూ ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసి అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని పొందుతారని భావిస్తున్నాను’’ అన్నారు.
 
కత్రినా కైఫ్ మాట్లాడుతూ ‘‘దీపావళి పండుగ అంటే అందరికీ ప్రత్యేకమైనది. అయితే ఈఏడాది నాకు మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే నేను, సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ రిలీజ్ అవుతుంది. చెడుపై మంచి ఎలా విజయం సాధించిందనే విషయాన్ని ఇందులో చూపించాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి రోజునే టైగర్ 3 రిలీజ్ కావటం ఆనందంగా ఉంది. నేను, సల్మాన్ ఖాన్ నటించిన సినిమాల్లో తొలిసారి దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమా ఇది. కచ్చితంగా మేం ప్రేక్షకులను మెప్పిస్తాం. ప్రేక్షకులకు మరింత సంతోషాన్ని, ఎగ్జయిట్‌మెంట్‌ను అందిస్తాం. దీపావళి అంటే సెలబ్రేషన్స్. అందరూ ఓచోటకు చేరటం, ప్రేమ, సంతోషాన్ని కుటుంబ సభ్యులు కలిసి సెలబ్రేట్ చేసుకోవటం అనేది మన మధ్య ఉన్న స్నేహ బంధాలను, బాంధవ్యాలను మరింతగా ధృడపరుస్తాయి’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments