Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9 నుంచి 18 వరకు స్కూల్స్‌కు దీపావళి సెలవులు

Advertiesment
govt school
, శుక్రవారం, 10 నవంబరు 2023 (13:10 IST)
దీపావళి పండుగను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకోనున్న విషయం తెల్సిందే. దీంతో పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ నెల 11వ తేదీన రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దీపావళి పండుగ. దీనికితోడు 13వ తేదీని ఏపీ ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఈ దఫా దీపావళి పండుగకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. 
 
సెంచరీల కింగ్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన వివ్ రిచర్డ్స్ 
 
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ ప్రపంచంలోని అత్తుత్తమ ఆటగాళ్ళలో ఒకటిగా అభివర్ణించాడు. మైదానంలో తమ ఇద్దరి దూకుడు ఒకటేలా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. 
 
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ అత్యుద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నారు. దీనిపై వివ్ రిచర్డ్స్ స్పందిస్తూ, "ఈ టోర్నీలో ఎందరో గొప్ప ఆటగాళ్లను చూశాం. కానీ, వీళ్లందరిలో టాప్ ఎవరంటే మాత్రం విరాట్ కోహ్లీనే. నేను అతడికి వీరాభిమానిని. సచిన్ వంటి క్రికెట్ దిగ్గజాల మధ్య ఒకటిగా విరాట్ నిలిచిపోతాడు' అంటూ కితాబిచ్చాడు. 
 
కాగా, ప్రపంచ కప్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫామ్‌లేమిపై ఆయన స్పందిస్తూ, ప్రపంచ కప్‌ ఆరంభానికి ముందు విరాట్ క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అతడు ఇక అవసరం లేదని కూడా కొందరు అసాధారణ కామెంట్స్ చేశారు. కానీ, విరాట్ మళ్లీ ఫామ్ సాధించడంలో అతడి వెన్నంటి ఉన్నవారు, బ్యాక్ రూం స్టాఫ్‌కే క్రెడిట్ దక్కుంది. ఇపుడతను మళ్లీ తన అత్యద్భుత ప్రదర్శన స్థితికి వచ్చేశాడు. 
 
క్రికెటర్ల ఫామ్ తాత్కాలికమని అంటారు కానీ, విరాట్ తాను ప్రత్యేకమని నిరూపించుకున్నామన్నాడు. అతడిని చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా ఫోకస్డ్‌గా కనిపిస్తున్న అతడు క్రికెట్‌కు దక్కిన ఓ గొప్ప క్రీడాకారుడు అని రిచర్డ్స్ అని వ్యాఖ్యానించాడు. అలాగే, మైదానంలో మా ఇద్దరి తీరు ఒకేలా ఉంటుందని, అందుకే కోహ్లీని తనతో అనేక మంది పోల్చుతుంటారని వివ్ రిచర్డ్స్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యభిచార గృహం నడిపిన 17 ఏళ్ల బాలిక అరెస్ట్.. ఎక్కడ?