నవంబర్ 30న తెలంగాణ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, న్గువు చేంజ్ నాయకులు అంజు అరోరా, దివ్య రాజేశ్వరి ఉపద్రష్ట ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్లపై చర్చ మొదలైంది. అనేక మంది సామాజిక కార్యకర్తల మాదిరిగానే, వారు కూడా అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు తగిన పారిశుద్ధ్య సౌకర్యాల ఆవశ్యకత వంటి కొన్ని కీలక సమస్యలు పరిష్కరించబడలేదని నమ్ముతున్నారు.
"గత సంవత్సరం, రాజ్యసభలో సమర్పించిన ఒక నివేదిక భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో చూస్తే, తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అతి తక్కువ మరుగుదొడ్లు ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30,023 పాఠశాలల్లో, 2,124 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. పారిశుద్ధ్య సౌకర్యాలు లేని పాఠశాలలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ,” అని అంజు అరోరా చెప్పారు.
ఏడాది గడిచినా కనీసం ఈ కొరతపై చర్చించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పుకోదగ్గ ప్రయత్నాలు చేయలేదని ఆమె అన్నారు. "ఋతుస్రావం సమయంలో, ఆడపిల్లలు తరచుగా ప్యాడ్‌లను మార్చడానికి తగిన సౌకర్యాలను కనుగొనడానికి చాలా కష్టపడతారు. అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ టాయిలెట్లలో చాలావరకు పనిచేయని ఫ్లష్‌లు, నీటి కొరత మరియు ఉపయోగించిన ప్యాడ్‌లను పారవేసే వ్యవస్థలు లేకపోవడంతో అపరిశుభ్రంగా ఉంటాయి. ఈ కారణాలు వల్ల ప్రతి నెలా పాఠశాల మానేస్తున్నారు " అని అన్నారు
హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని దివ్య రాజేశ్వరి ఉపద్రష్ట అభిప్రాయపడ్డారు. "మహిళలకు అవసరమైన పబ్లిక్ టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఏడాది జూలైలో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది." అని దివ్య పేర్కొంది. అనేక పాఠశాలలకు ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మన ఊరు మన బడి' ప్రారంభించినప్పటికీ, ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఇప్పటికీ 150 పాఠశాలలకు సరిపడా మరుగుదొడ్లు లేవన్నారు.
“మన ఊరు మన బడి వంటి కొన్ని ప్రశంసనీయమైన పథకాలు గతంలో ప్రవేశపెట్టబడినప్పటికీ, సరైన ట్రాకింగ్ మెకానిజం లేకపోవటం చేత చాలా ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాల ప్రయోజనాన్ని దెబ్బతీశాయి. వాగ్దానాలు, ఎజెండాలు స్పష్టమైన మార్పుకు దారితీయాలి కానీ కాగితంపై ఉండకూడదు" అని దివ్య జోడించారు.