Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజ్‌లో స్టూడెంట్స్ సమక్షంలో నితిన్‌ ఎక్స్ ట్రా - ఆర్డినరీ మ్యాన్‌ సాంగ్

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (19:19 IST)
Nitin with students
 నితిన్,  బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’.  రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘బ్రష్ వేసుకో..’ అనే లిరికల్ పాటను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. దీనికి CMR కాలేజ్ వేదికగా మారింది. పాటను వింటుంటే చాలా హామింగ్‌గా అనిపించింది. ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్‌తో హేరిష్ జైరాజ్ అందించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. సంజిత్ హెగ్డే పాడారు. కచ్చితంగా చార్ట్ బస్టర్‌లో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనిపించేలా మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
 
ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల...’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను అర్మాన్ మాలిక్ పాడారు. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్.. అందులో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ మెప్పించింది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
 
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ కనిపించని సరికొత్త అవతార్‌ను ఈ చిత్రంలో చూడబోతున్నారని, మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ మెప్పిస్తుందని రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ తెలియజేశారు.
 
మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీతం అందిస్తుండ‌టం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. రీసెంట్ విడుద‌లైన డేంజ‌ర్ పిల్లా సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

ఒడిశా తీరాన్ని దాటిన తుఫాను- ఆంధ్రలో భారీ వర్షాలు: నలుగురు మృతి

ఏపీలో ఆటో డ్రైవర్లకు పండగే పండగ ... 4 నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

తర్వాతి కథనం
Show comments