Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్ న్యూస్ - మెగాస్టార్‌తో 'పాతాళ భైరవి' తీయ‌నున్న 'మ‌హాన‌టి' డైరెక్ట‌ర్..!

నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మారుమోగుతోన్న పేరు ఇది. త‌న తొలి ప్ర‌య‌త్నంగా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమా తీసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు కానీ... నాగ్ అశ్విన్‌ టాలెంట్‌ని ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా గుర్తించ‌లేదు. ఎప్పుడైతే.. మ‌హాన‌టి సినిమా తీస

Webdunia
శనివారం, 12 మే 2018 (13:57 IST)
నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మారుమోగుతోన్న పేరు ఇది. త‌న తొలి ప్ర‌య‌త్నంగా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమా తీసి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు కానీ... నాగ్ అశ్విన్‌ టాలెంట్‌ని ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా గుర్తించ‌లేదు. ఎప్పుడైతే.. మ‌హాన‌టి సినిమా తీసి సంచ‌ల‌న విజ‌యం సాధించాడో.. అంద‌రి దృష్టి నాగ్ అశ్విన్ పైనే పడింది. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మ‌హాన‌టి నిర్మాత‌లు స్వ‌ప్న‌ద‌త్, ప్రియంకా ద‌త్, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్‌ల‌ను ఇంటికి పిలిచి స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చిరంజీవి తాను నాగ్ అశ్విన్‌తో సినిమా చేసేందుకు రెడీ అని చెప్ప‌గా.. నాగ్ అశ్విన్ త‌ను చిరంజీవి గారి కోసం క‌థ రెడీ చేస్తున్నాన‌ని చెప్పారు. ఈ సినిమాని త‌మ సంస్థే నిర్మిస్తుంద‌ని అశ్వ‌నీద‌త్ చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ... తనతో పాతాళ భైరవి లాంటి సినిమా తీయాలనుంది నాగ్ అశ్విన్ చెప్పాడని నవ్వుతూ అన్నారు.
 
కాబట్టి... చిరంజీవి 152వ చిత్రం వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఉండ‌చ్చు. ఇదే క‌నుక జ‌రిగితే... నాగ్ అశ్విన్‌కి బంప‌ర్ ఆఫ‌రే..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments