Webdunia - Bharat's app for daily news and videos

Install App

BB5: ఆవేశంలో శన్ముఖ్, జెస్సీ... నామినేషన్‌లు సీక్రెట్‌

Bigg Boss Telugu Season 5
Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (13:14 IST)
బిగ్ బాస్ సీజన్ 5 అయిదో వారం నామినేషన్‌లు సీక్రెట్‌గా మొదలై సీరియస్‌గా ముగిశాయి. నామినేషన్ ప్రక్రియని ప్రారంభించిన బిగ్ బాస్ మునుపటిలా ఇంటి సభ్యులను ప్రత్యక్షంగా నామినేషన్ చేయకుండా.. కన్ఫేషన్ రూమ్ కి ఒక్కొక్కరిని పిలిచి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరి పేర్లను చెప్పాలని బిగ్ బాస్ జెస్సి నుండి నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాడు. 
 
ఇంటి సభ్యులు ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే.. జెస్సి - రవి, లోబో సన్నీ - ప్రియ, శన్ముఖ్ విశ్వా - జెస్సీ, శన్ముఖ్ కాజల్ - రవి, సన్నీ లోబో - శన్ముఖ్, మానస్ రవి - జెస్సి, శన్ముఖ్ ప్రియాంక - హమీదా, లోబో సిరి - రవి, హమీదా ఆని - రవి, విశ్వా శన్ను- విశ్వా, మానస్ హమీదా - ప్రియ, శన్ముఖ్ శ్వేతా - కాజల్, మానస్ ప్రియ - శన్ముఖ్, సన్నీ మానస్ - జెస్సి, శన్ముఖ్
 
శ్రీరాం - జెస్సి, శన్ముఖ్ నామినేషన్ పూర్తైన తర్వాత బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన ఒక్కో ఇంటి సభ్యున్ని పిలిచి ఎవరు వాళ్ళను నామినేట్ చేశారో ఇంటి సభ్యుల ముందు రివీల్ చేస్తాడు. ఐదో వారం నామినేషన్‌లో ఎక్కువ మంది ఇంటి సభ్యులు శన్ముఖ్ జస్వంత్‌ని నామినేట్ చేయగా ఇక వరుసగా యాంకర్ రవి, జెస్సి, లోబో, విశ్వ, మానస్, సన్నీ, ప్రియలు ఈ వారం నామినేట్ అయ్యారు. 
 
నాలుగు వారాల తర్వాత మొదటిసారి నామినేట్‌లో నిలిచిన శన్ముఖ్ ఈరోజు నుండి మనం అంటే ఏంటో చూపిద్దామని జెస్సితో మాట్లాడుకోవడం.. ఆ తరువాత ఒక సందర్భంలో కిచెన్ లో పని చేయాల్సిన విషయంలో కెప్టెన్ శ్రీరామచంద్రతో జెస్సి అనవసరంగా గొడవపడటం జరుగుతుంది. అయితే అక్కడ జరిగిన విషయం తెలియని శన్ముఖ్, ఆర్జే కాజల్, సిరి హనుమంత్.. కెప్టెన్ శ్రీరామచంద్రతో మాట్లాడిన తీరు ఇంటి సభ్యులకు కూడా కోపం తెప్పించింది. 
 
నాలుగు వారాల వరకు సైలెంట్ గా ఉన్న శన్ముఖ్ ఈసారి నామినేషన్‌లోకి వచ్చేసరికి ఆవేశంతో ఆలోచన లేకుండా అసలు విషయం తెలియక మాట్లాడాడని అతనికి జెస్సికి మధ్య జరిగిన సంభాషణతో అర్ధమవుతుంది. ఇప్పటికే పలువురు హౌస్ మేట్స్ ఇంట్లో చిన్నపిల్లోడిలా జెస్సి ప్రవర్తిస్తాడని చెప్పినట్టుగానే సోమవారం కూడా తను మాట్లాడిన మాటలకు, తన తోటి సభ్యులతో ప్రవర్తించిన తీరు చూస్తే పిల్లాడిలాగే ప్రేక్షకులకు సోమవారం ఎపిసోడ్‌లో కనిపించింది. 
 
అంతేగాకుండా నామినేషన్‌కి ముందు సిరి హనుమంత్, షణ్ముఖ్ జశ్వంత్ మాట్లాడుకుంటూ నాలుగో వారం నామినేషన్ లో అందరికంటే ఎక్కువ ఓట్లు నీకే వచ్చాయని తనకి అనిపిస్తుందని శన్ముఖ్ అనడం.. అందుకు సిరి కూడా నిజమే కావొచ్చని ఒక చిన్న నవ్వుతో అతడికి సమాధానం చెబుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

వేసవి రద్దీ - తిరుపతికి 8 ప్రత్యేక రైళ్ళు : దక్షిణ మధ్య రైల్వే

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments