Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీటెక్కిన మా ఎన్నికలు : 'ఏజెంట్లతో పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర' .. ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (13:00 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్నకొద్దీ సినీ రాజకీయం వేడెక్కుతోంది. మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. 
 
ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘మా’ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగం అవుతోందని చెప్పారు. ఈ మేరకు తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం జీవితా రాజశేఖర్‌, శ్రీకాంత్‌ తదితరులతో కలిసి ప్రకాశ్‌రాజ్‌ మీడియాతో మాట్లాడారు.
 
'60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులు. ఏజెంట్ల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్నారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానల్‌ సంతకాలు సేకరిస్తోంది. సోమవారం సాయంత్రం విష్ణు తరపున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరపున రూ.28 వేలు కట్టారు. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు? 
 
కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరపు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా? ఇలా గెలుస్తారా? మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి' అంటూ ప్రశాష్ రాజ్ నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments