Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నీళ్లు పెట్టుకుని.. అలిగివెళ్లిపోయిన ప్రకాష్ రాజ్.. ఏమైంది?

Advertiesment
Prakash Raj Latest Press Meet
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:30 IST)
మా ఎన్నికల హడావుడి అంతా ఇంతా కాదు.. మా పోటీదారులు ప్రకాష్ రాజ్, మంచు మనోజ్‌ల మధ్య వార్ జరుగుతోంది. నువ్వా నేనా అన్నట్లు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ మా ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రెస్ మీట్‌లో భావోద్వేగానికి గురైయ్యారు. మా ఎన్నికల్లో నేనేక్కడ గెలుస్తాను అంటూ భావోద్వేదానికి గురయ్యారు. అంతే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా మంగళవారం ప్రకాష్ రాజ్ పెట్టిన ప్రెస్ మీట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టారు. 
 
ఈ ప్రెస్ మీట్‌లో ప్రధానంగా మంచు మనోజ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరుగుతున్న ఈ ఎన్నికల ద్వారా తానెక్కడ గెలుస్తానని నిరాశకు గురయ్యారు. శరత్ బాబు లాంటి తారల మెంబర్ షిప్ పైసలు కూడా మనోజ్ కట్టేసి గెలుపొందేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మా ఎన్నికలను మంచు మనోజ్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
అంతేగాకుండా భావోద్వేగానికి లోనై.. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకేముంది.. అంతా అయిపోందన్నట్లు ప్రెస్ మీట్ నుంచి కన్నీళ్లతో అర్థాంతరంగా వెళ్లిపోయారు. అయితే మా ఎన్నికల్లో ఈసారి అనూహ్య పరిణామాలు చోటుచేసుకునేందుకు ప్రకాష్ రాజే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మా ఎన్నికలు సాదాసీదాగా జరిగిపోతాయని... ఈసారి రాజకీయ ఎన్నికలను మా ఎన్నికలు తలపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ బిగ్ బాస్‌లో తెలుగమ్మాయి.. ఎవరామె?