Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళ బిగ్ బాస్‌లో తెలుగమ్మాయి.. ఎవరామె?

Advertiesment
తమిళ బిగ్ బాస్‌లో తెలుగమ్మాయి.. ఎవరామె?
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (10:39 IST)
pavani reddy
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‏బాస్. అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నరియాల్టీ షో. బిగ్ బాస్ ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం భాషలలో దూసుకపోతుంది. ఈ క్రమంలోనే .. తాజా తమిళంలో కూడా బిగ్ బాస్ తమిళ్‌ ఐదో సీజన్ మొదలవుతుంది.
 
దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ అక్టోబర్ 3 ఆదివారం నాడు ప్రసారమైంది. తెలుగు షోలో 19మందిని తీసుకోగా.. తమిళంలో 18 మంది కంటెస్టెంట్స్ తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ఈ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే.. తమిళ బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం ఓ తెలుగమ్మాయికి దక్కింది. ఆమె పేరు పావని రెడ్డి.
 
తెలుగు, తమిళ్‌లో సీరియల్స్ లో నటిస్తున్న ముద్దుగుమ్మ పావని రెడ్డి. ఆమె తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తెలుగులో అగ్నిపూలు, నేను ఆయన ఆరుగురు అత్తలు సీరియల్ లో నటించింది. కానీ వీటితో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.
 
అక్కడ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఆమె సిరియల్‌తో పాటు అప్పుడప్పుడూ చిన్న సినిమాల్లో మెరిసింది. ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో కేవలం నటిగానే కాకుండా కాంట్రవర్సీలతో చాలా పాపులర్టీ సంపాదించుకుంది. 
 
ఆమె భర్త, తెలుగు టీవీ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో పావని రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా.. ప్రస్తుతం తమిళ ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా మెదడు మొద్దుబారిపోయింది.. డైవర్స్‌పై సమంత తండ్రి ఆవేదన