బిగ్ బాస్ కంటెస్టెంట్ల కన్నా వారిని నడిపించే బిగ్ బాస్‌కు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ హోస్ట్ అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో బ్యాలెన్స్‌గా అందరితో మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరిని నొప్పించకూడదు.. ఎవరితోను అతిగా మాట్లాడకూడదు. ఎందుకంటే లక్షలాది మంది చూసే ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి.
అలాంటి బిగ్ బాస్ షోను సమర్ధవంతంగా నడిపించారు కింగ్ నాగార్జున. తనదైన శైలిలో కంటెస్టెంట్లతో మాట్లాడుతూ ఆయన అందరి మన్ననలను అందుకున్నాడు. హోస్ట్ అంటే ఇలా ఉండాలని నాగ్ నిరూపించాడు. తనకు రాసిచ్చిన స్క్రిప్ట్ కాకుండా సొంతంగాను తనదైన శైలిలో మాట్లాడుతూ అందరిని మెప్పించాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ 5 సీజన్ రాబోతోంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ అని అందరూ ఫిక్సయిపోయారు. కానీ సినిమాల్లో బిజీగా ఉన్న నాగ్ ఈసారి హోస్ట్‌గా వ్యవహరించడం కష్టమంటున్నారు నిర్వాహకులు.
నాగ్ ప్రస్తుతం సత్తారు డైరెక్టన్లో ఒక సినిమాను, అలాగే కళ్యాణ్ క్రిష్ణ డైరెక్షన్లో బంగార్రాజు సినిమాలలో నటిస్తున్నారు. చాలా బిజీ షెడ్యూల్లో సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హోస్టుగా సమయం కేటాయించడం సాధ్యం కాదంటున్నారు నాగార్జున.
అందుకే రానాను హోస్ట్‌గా పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారట. రానా ఇప్పటికే నెం.1 యారి షోతో అందరి మన్ననలను అందుకున్నాడు. సినిమాలు ప్రస్తుతం లేవు. అందుకే రానా అయితే కరెక్టుగా సరిపోతారని నిర్ణయించుకుని హోస్ట్‌గా డిసైడ్ చేశారట.