Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను శారీరకంగా వాడుకున్నారు, కానీ ఆ ఒక్కటి..?

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (22:24 IST)
కరాటే కళ్యాణి. ఈమె అందరికీ తెలియకపోయినా సినిమాలు బాగా చూసేవారికి మాత్రం బాగా తెలుస్తుంది. కొన్ని క్యారెక్టర్లు చేసిన ఈమెకు తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరే ఉంది. అందుకే ఈమెకు బిగ్ బాస్ 4లో అవకాశం లభించింది. 
 
అయితే ఈమె  ఆవేదనకు గురవుతూ చెప్పిన కొన్ని విషయాలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నా స్వస్ధలం శ్రీకాకుళం జిల్లా కవిటి. నన్ను కరాటే కళ్యాణి అని పిలుస్తున్నారని... మా ఇంటి పేరు అదే అనుకుని డిసైడ్ కావద్దండి. 
 
కరాటేలో నాలుగు మెడల్స్ వచ్చాయి. అందుకే ఆ పేరు వచ్చింది నాకు. నా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. నాకు పెళ్ళిళ్ళు అయ్యాయి. కానీ నన్ను శారీరకంగా వాడుకున్నారు కానీ బిడ్డ మాత్రం పుట్టలేదు. ఎన్నోసార్లు కడుపు పట్టుకుని చూసుకున్నాను. కానీ బిడ్డ పుట్టే అదృష్టం లేకుండా పోయింది. 
 
అది తలుచుకుని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఒకసారి మా ఇంటి పక్కన ఒక చెత్త బుట్టలో పుట్టిన బిడ్డను పడేసి వెళ్ళిపోయారు ఎవరో. అందరూ చుట్టుముట్టారు. బిడ్డను చూస్తున్నారు తప్ప ఎవరూ ఎత్తుకోలేదు. నేను ఎత్తుకున్నాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ బిడ్డకు తల్లి నేనే అని.
 
ఇప్పుడు ఆ బిడ్డకు 10 యేళ్ళు. నన్ను అమ్మ అంటూ ఆప్యాయంగా పిలుస్తున్నాడు. అది చాలు నాకు. ఈ జన్మకు ఆ పిలుపు దక్కుతుందా లేదా అనుకున్నాను. కానీ ఆ అదృష్టం నాకు దక్కింది. ఎంతో సంతోషంగా ఉన్నాను. సినిమా అవకాశాలు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాకు కొన్ని అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేదంటోంది కరాటే కళ్యాణి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments