Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ 4 కంటిస్టెంట్లు, వీళ్లను చూస్తే షో ఇంట్రెస్ట్ అనిపిస్తుందా?

Advertiesment
బిగ్ బాస్ 4 కంటిస్టెంట్లు, వీళ్లను చూస్తే షో ఇంట్రెస్ట్ అనిపిస్తుందా?
, సోమవారం, 7 సెప్టెంబరు 2020 (12:00 IST)
తెలుగులో మూడు సీజన్లు ప్రేక్షకులను అద్భుతంగా అలరించి బుల్లితెర మీద రికార్డులు సృష్టించిన బిగ్ బాస్ నాలుగవ సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్‌కు కూడా గత సీజన్లో హోస్ట్‌గా చేసిన నాగార్జుననే వ్యవహరిస్తున్నారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఇందులో చాల రంగాలకు చెందిన ఫేమస్ పర్సన్స్ ఉన్నారు. ఇక ఈ సీజన్లో హోస్ట్ గానే గాక నాగార్జున తండ్రి పాత్రలో కూడా సరికొత్తగా కనిపించాడు.
 
1. మొదటి కంటెస్టంట్‌గా టాలీవుడ్ నటి మోనాల్ గజ్జర్ ఎంట్రీ ఇచ్చింది
 
2. ప్రముఖ రచయిత, దర్శకుడు సూర్యకిరణ్ రెండో కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2002లో సత్యం సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.
 
3. మూడో కంటెస్టంట్‌గా లక్ష్మీప్రసన్న లాస్య ప్రియాంక రెడ్డి అలియాస్ లాస్య బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు.
 
4. నాలుగో కంటెస్టంట్‌గా అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు
 
5. ఐదో కంటెస్టంట్‌గా జోర్దార్ సుజాత బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టింది.
 
6. ఆరో కంటెస్టెంట్‌గా సోషల్ మీడియా సెన్సేషన్ మెహబూబ్ దిల్ సే ఎంట్రీ ఇచ్చాడు. ఇతను టిక్ టాక్ వీడియోస్, సాంగ్స్, పెరఫార్మెన్సులతో యూట్యూబ్‌లో బాగా ఫేమస్.
 
7. ఏడో కంటెస్టెంట్‌గా దేవి నాగవల్లి బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించింది. రాజమండ్రిలో పుట్టిన దేవి నాగవల్లి న్యూస్ రీడర్‌గా, న్యూస్ ప్రజెంటర్‌గా అందరికీ సుపరిచితురాలు.
 
8. దేత్తడి హారిక ఎనిమిదో కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.
 
9. తొమ్మిదో కంటెస్టంట్‌గా టీవీ యాక్టర్ సయ్యద్ సోయల్ రియాన్ బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించాడు.
 
10. పదవ కంటెస్టంట్‌గా అరియానా గ్లోరి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. జెమినీ టీవీలో ప్రసారమయ్యే కెవ్వు కామెడీ షోలో యాంకర్‌గా అందరినీ అలరించింది అరియానా గ్లోరి.
 
11. పదకొండో కంటెస్టంట్‌గా ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
 
12. టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి 12వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది.
 
13. నోయల్ బిగ్ బాస్ హౌజ్ లోకి 13వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.
 
14. పద్నాలుగో కంటెస్టెంట్‌గా వెబ్ సిరీస్ నటి దివి ఎంట్రీ ఇచ్చారు.
 
15. పదిహేనవ కంటెస్టెంట్‌గా నటుడు అఖిల్‌ ఎంటరయ్యాడు.
 
16. పదహారవ కంటెస్టెంట్‌గా యూట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ సినీ రచయితపై వేధింపుల కేసు!