Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా బిగ్ బాస్-3 మొదలుకాకముందే ఆ హీరోపై ట్రోలింగ్...?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (14:54 IST)
ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ మరింత ఎక్కువైపోయింది. ఇంకా చెప్పాలంటే పీఎం, సీఎం అనే తేడా లేకుండా సెలబ్రిటీలపై ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువగా జరుగుతోంది. అయితే ట్రోలింగ్ శ్రుతిమించితే జైలుపాలయ్యే అవకాశం ఉన్నా ఈ ట్రోలింగ్‌కు విరుగుడు దొరకడం కష్టంగా ఉంది. గతేడాది బిగ్‌బిస్‌ సీజన్ 2 కారణంగా సోషల్ మీడియాలో యుద్ధాలు జరిగిన విషయం తెలిసిందే. 
 
కంటెస్టెంట్ల అభిమానులు సోషల్‌ మీడియాలో పరస్పరం మాటల యుద్దానికి దిగడం, దూషించుకోవడం గుర్తుండే ఉంటుంది. అంతటితో ఆగకుండా హోస్ట్‌గా చేసిన నానిని సైతం చాలా దారుణంగా ట్రోలింగ్‌కు గురి చేశారు.
 
ఇక స్టార్‌ మా బృందం మూడో సీజన్‌ను ఇటీవల అనౌన్స్ చేసి, విడుదల చేసిన ప్రోమోలో కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా చేయనున్నట్లు అర్థమైంది. ఇక సోషల్‌ మీడియాలో అప్పుడే ఈ కార్యక్రమానికి సంబంధించిన పేజీలు ప్రారంభమై, అందులో దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తూ ఉన్నాయి. ఇంకా హోస్ట్‌గా ఒక్క ఎపిసోడ్‌ చేయకముందే.. నాగ్‌పై నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
 
దేవదాస్ సినిమా విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌ షో గురించి తనను అడగితే బ్యాడ్‌గా మాట్లాడతానని అన్నారు. బిగ్‌బాస్‌ కాన్సెప్ట్‌ నచ్చదని, అవతలి వ్యక్తులు ఏం చేస్తున్నారో చూడటం ఇలాంటివన్నీ తనకు నచ్చవని చెప్పుకొచ్చారు. దీంతో ఈ మాటలను పట్టుకుని ఇప్పుడు ఎలా హోస్ట్ చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 
 
కొంతమంది కర్మ అంటే ఇదే.. ఏదైతే నచ్చదని చెప్పాడో ఆ షోకే హోస్ట్‌గా చేస్తున్నాడని ఒకరు.. ఎక్కువ డబ్బు ఇచ్చారు కాబట్టి చేస్తున్నాడని మరొకరు కామెంట్స్‌ చేయగా.. కొందరు ‘ఇందులో తప్పేముందని, వ్యక్తిగత అభిప్రాయం మరియు వృత్తిపరమైన నిర్ణయం వేరు’ అంటూ నాగ్‌కు మద్దతు పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments