సూపర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన "భరత్ అనే నేను" సినిమా ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. 'శ్రీమంతుడు' కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై
సూపర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన "భరత్ అనే నేను" సినిమా ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. 'శ్రీమంతుడు' కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్ధాయిలో నిర్వహించడం.. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కావడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది.
ఇదిలావుంటే... భరత్ అనే నేను కథ విషయంలో గత కొన్ని రోజులుగా ఓ వార్త ప్రచారంలో ఉంది. అది ఏమిటంటే... ఈ కథ కొరటాల రాసిన కథ కాదని... డైరెక్టర్ శ్రీహరి నాను రాసిన కథ అని టాక్ వినిపిస్తోంది. ఇదే విషయం గురించి కొరటాలని అడిగితే... తన దగ్గర ఓ పది కథలు రెడీగా ఉన్నాయని... తనకు వేరే రైటర్ దగ్గర నుంచి కథ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు.
అయితే... శ్రీహరి నాను తనకు గతంలో రూమ్‌మేట్, ఫ్రెండ్ అని.. అప్పట్లో హీరో ముఖ్యమంత్రి అయితే... అంటూ ఓ ఐడియా ఇచ్చాడని.. దానిని నేను డెవలప్ చేసి కథగా రాసానని చెప్పారు. ఐడియా ఇచ్చిన శ్రీహరికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ టైటిల్స్‌లో వేస్తున్నామని చెప్పారు. అదీ... సంగతి.